Fishing Boat Missing: 40 మంది మత్స్యకారులతో బోటు గ‌ల్లంతు.. అరేబియా సముద్రంలో గాలింపు చర్యలు

Published : Dec 05, 2023, 01:22 PM IST
Fishing Boat Missing: 40 మంది మత్స్యకారులతో బోటు గ‌ల్లంతు.. అరేబియా సముద్రంలో గాలింపు చర్యలు

సారాంశం

40 Fishermen Missing in Arabian Sea: ఈ బోటు గోవాలోని పనాజీ నుంచి బయలుదేరిందనీ, ఉత్తర కన్నడ జిల్లా అంకోలాలోని బెలికేరి సమీపంలో చివరి జీపీఎస్ సిగ్నల్ నమోదైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బోటులో మొత్తం 40 మంది ఉన్నారు.  

Karnataka: అరేబియా సముద్రంలో 40 మంది మత్స్యకారులతో వెళ్తున్న బోటు గల్లంతైంది. ఈ ఘటన క‌ర్నాట‌క‌ రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ లో చోటుచేసుకుంది. కర్ణాటక పరిధిలోని అరేబియా సముద్రంలో తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా గత వారం కూడా బోటు గల్లంతైన విషయం తెలిసిందే. గోవాలో రిజిస్టర్ అయిన ఈ బోటు ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తి బలమైన గాలులకు కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ఇది గోవాలోని పనాజీ నుంచి బయలుదేరిందనీ, ఉత్తర కన్నడ జిల్లా అంకోలాలోని బెలికేరి సమీపంలో చివరి జీపీఎస్ సిగ్నల్ నమోదైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నాలుగు రోజులుగా నెట్ వర్క్ తెగిపోవడంతో గల్లంతైన బోటు ఆచూకీ కోసం కోస్టల్ గార్డులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !