కర్ణాటకలో మతమార్పిడుల నిరోధక బిల్లు రద్దు.. వచ్చే శాసన సభ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న సిద్ధరామయ్య ప్రభుత్వం

Published : Jun 15, 2023, 04:33 PM IST
కర్ణాటకలో మతమార్పిడుల నిరోధక బిల్లు రద్దు.. వచ్చే శాసన సభ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న సిద్ధరామయ్య ప్రభుత్వం

సారాంశం

కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మతమార్పిడుల నిరోధక బిల్లును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సమావేశమైన సిద్ధరామయ్య మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నెల రోజుల తర్వాత సిద్ధరామయ్య నేతృత్వంలోని మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గత బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద మతమార్పిడి నిరోధక బిల్లును రద్దు చేయాలని గురువారం నిర్ణయించింది. దీని కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

ఉత్తరకాశీ మత ఉద్రిక్తత : పురోలాలో జరగని ‘మహాపంచాయత్’..కొనసాగుతున్న 144 సెక్షన్

అలాగే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) చట్టంలో చేసిన మార్పులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కన్నడ, సోషల్ సైన్స్ సబ్జెక్టులకు అనుబంధ పాఠ్యపుస్తకాలను అందించాలని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాయకులు మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ హెగ్డేవార్, వినాయక్ దామోదర్ సావర్కర్లతో పాటు మితవాద వక్త చక్రవర్తి సూలిబెలె రాసిన పాఠాన్ని తొలగించాలని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయించింది.

ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టిన మహారాష్ట్ర బాలిక.. వరుసగా ఐదు రోజుల పాటు డ్యాన్స్..

అప్పటి కర్ణాటక మంత్రివర్గం డిసెంబర్ 2021లో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ప్రభుత్వం ఈ విషయంపై ఆర్డినెన్స్ తీసుకురావాలని అప్పటి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్‌ను మే 17,2022న కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించారు. సెప్టెంబరు 2022లో దీనిని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ చట్టాన్ని కాంగ్రెస్ నేతలు, క్రైస్తవ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

చెప్పులు కనిపించడం లేదంటూ మాజీ మేయర్ ఫిర్యాదు.. 4 వీధి కుక్కలను బంధించి, స్టెరిలైజ్ చేసిన అధికారులు

ఇటీవల ముగిసిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అధికార బీజేపీని ఓడించింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా కాంగ్రెస్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలను, చట్టాలను, నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుత మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?