భద్రత కోసం సంజయ్ రౌత్ కు బెదిరింపులు: సోషల్ మీడియాలో విమర్శలు

Published : Jun 15, 2023, 04:15 PM IST
భద్రత కోసం  సంజయ్ రౌత్ కు  బెదిరింపులు: సోషల్ మీడియాలో  విమర్శలు

సారాంశం

శివసేన నేత  సంజయ్ రౌత్ కు  బెదిరింపు కాల్స్ విషయంలో ట్విస్ట్  చోటు  చేసుకుంది.  భద్రత కోసం  బెదిరించినట్టుగా  నిందితుడు చెప్పడంతో  సోషల్ మీడియాలో విమర్శలు చోటు  చేసుకున్నాయి.  

ముంబై:  శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గానికి చెందిన  నేత  సంజయ్ రౌత్  మరోసారి వార్తల్లో నిలిచారు.  సంజయ్ రౌత్ తో పాటు  అతని  సోదరుడికి  ఇటీవల  బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.  చంపుతామని  బెదిరించినట్టుగా  సంజయ్ రౌత్ పోలీసులకు ఫిర్యాదు  చేశారు.  ఈ కేసులో  పోలీసులు  మయూరు షిండే  అనే వ్యక్తిని  పోలీసులు అరెస్ట్  చేశారు.  షిండేపై  పలు  కేసులున్నాయని పోలీసులు గుర్తించారు.

సంజయ్ రౌత్ కు భద్రతను  కల్పించాలనే ఉద్దేశ్యంతో  ఈ బెదిరింపు  ఫోన్ కాల్స్ చేసినట్టుగా నిందితుడు  పోలీసుల దర్యాప్తులో  చెప్పారని  సమాచారం.  ఏక్ నాథ్ షిండే  సీఎంగా బాధ్యతలు  స్వీకరించిన  తర్వాత  సంజయ్ రౌత్ కు  కల్పించిన భద్రతను తొలగించారు. 

 

మయూర్ షిండేకు  సంజయ్ రౌత్ సోదరుడు సునీల్ రౌత్ కు అత్యంత సన్నిహితుడుగా  చెబుతున్నారు.  భద్రత కోసం  ఈ రకంగా బెదిరింపు ఫోన్లు చేసినట్టుగా నిందితుడు  చెప్పినట్టుగా  మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో  సోషల్ మీడియాలో  సంజయ్ రౌత్ పై  విమర్శలు గుప్పిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌