ప్రముఖ కలరిస్ట్, ప్రొడ్యూసర్ సరోజ్ అంబర్ కొఠారే ఏకే జెన్మా కన్నుమూత..

By Asianet News  |  First Published Jul 16, 2023, 8:33 AM IST

తన భర్తతో కలిసి ‘ఆర్టిస్ట్ కంబైన్’ అనే రంగస్థల నిర్మాణ సంస్థను స్థాపించి, ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సరోజ్ అంబర్ కొఠారే చనిపోయారు. ఆమె ఓ నటిగా, కలరిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాల కారణంగా ఆమె శనివారం మరణించారు. 


ప్రముఖ కలరిస్ట్, ప్రొడ్యూసర్ సరోజ్ అంబర్ కొఠారే అలియాస్ జెన్మా ఇక లేరు. ఆమె శనివారం సాయంత్రం తన 93 ఏళ్ల వయస్సులో కన్నమూశారు. అయితే ఆమె మరణానికి ఖచ్చితమైన కారణాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించనప్పటికీ, వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాల కారణంగా సరోజ్ మరణించినట్లు తెలుస్తోంది.

నటీ నటులు 30 రోజులు టమాటాలు తినకపోతే శరీరంలో ప్రోటీనేం తగ్గిపోదు - మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ముండే..

Latest Videos

ఆమె మరణాన్ని కుమారుడు, ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు మహేష్ కొఠారే శనివారం ప్రకటించారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తల్లికి నివాళి అర్పించారు. ‘‘సరోజ్ అంబర్ కొఠారే (జెన్మా) 19/06/1930 - 15/07/2023.  కొఠారే కుటుంబం మొత్తం హృదయపూర్వక నివాళులు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం’ అని మరాఠీలో పేర్కొన్నారు. కొద్ది నెలల క్రితం తండ్రిని కోల్పోయిన మహేష్ కొఠారే.. తాజాగా తల్లిని కూడా కోల్పోయారు. ఆయన తండ్రి అంబర్ కొఠారే ఈ ఏడాది జనవరి 21వ తేదీన తన 96 ఏళ్ల వయస్సులో చనిపోయారు.

సరోజ్ అంబర్ కొఠారే ప్రముఖ వ్యక్తి మాధవరావు తల్పాడేకు 1930 జూన్ 19వ తేదీన జన్మించారు. ఆమె ప్రముఖ కలరిస్ట్, నటిగా పేరు తెచ్చుకున్నారు. 1952 లో ఆమె అంబర్ కొఠారేను వివాహం చేసుకున్నారు. తరువాతి కాలంలో ఈ దంపతులు ‘ఆర్టిస్ట్ కంబైన్’ అనే రంగస్థల నిర్మాణ సంస్థను స్థాపించింది.

దారుణం.. గవర్నమెంట్ స్కూల్ టీచర్ హత్య.. విజయనగరంలో ఘటన

అక్కడ వారు వివిధ రకాల నాటకాలను ప్రదర్శించేవారు. జెన్మా, ఆమె భర్త అంబర్ కొఠారే లగ్నాచి బేడీ, జోపి గెలా జసా జాలా తదితర చిత్రాల్లో కలిసి పనిచేశారు. అనంతర కాలంలో ఆమె కుమారుడు మహేష్ కొఠారే ధుమ్హడకతో తన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కెరీర్ ను ప్రారంభించారు. తరువాత ఆయన దే దానదన్, ధడకేబాజ్, జపట్ల, మజా చాకులా వంటి మరెన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు.
 

click me!