పుష్ఫ మూవీ స్టైల్లో గంజాయి స్మగ్లింగ్...ఐటీ సిటీలో రూ.12 కోట్ల విశాఖ గంజాయి

Published : Jul 16, 2023, 08:13 AM ISTUpdated : Jul 16, 2023, 08:16 AM IST
పుష్ఫ మూవీ స్టైల్లో గంజాయి స్మగ్లింగ్...ఐటీ సిటీలో రూ.12 కోట్ల విశాఖ గంజాయి

సారాంశం

విశాఖ మన్యం ప్రాంతంలో గంజాయిని సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఓ ముఠాను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసారు. 

బెంగళూరు : పుష్ప సినిమాలో పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనంను స్మగ్లింగ్ చేస్తున్నాడు హీరో. పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమానే ఫాలోఅయ్యారో ఏమో ఓ ముఠా గంజాయిని కూడా సేమ్ ఇలాగే స్మగ్లింగ్ చేస్తున్నారు. కోట్ల విలువచేసే భారీ గంజాయిని ప్రత్యేకంగా రూపొందించిన వాహనాల్లో రాష్ట్రాల బార్డర్లు దాటిస్తోంది స్మగ్లింగ్ ముఠా. తాజాగా ఈ గంజాయి స్మగ్లింగ్ గుట్టు రట్టయి ఇద్దరు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. 

బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన లక్ష్మిమోహన్  దాస్, రాజస్థాన్ కు చెందిన చంద్రభాన్ బిష్టోయ్ కలిసి గంజాయి దందా చేస్తున్నారు. విశాఖ మన్యం, ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో కొందరు గుట్టుగా గంజాయిని పండించే విషయం తెలిసిందే. ఇలాంటి వారివద్ద భారీగా గంజాయిని సేకరించేవారు మోహన్ దాస్, బిష్ణోయ్. పోలీసులకు చిక్కకుండా ఈ గంజాయిని తరలించేందుకు ప్రత్యేకంగా ఓ గూడ్స్ వాహనాన్ని తయారుచేయించారు. ఇందులో టన్నులకొద్దీ గంజాయిని తరలిస్తూ కోట్లలో దందా చేస్తున్నారు.

గంజాయిని తరలించే వాహనం నంబర్ ప్లేట్ ను కూడా మారుస్తూ ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తపడేవారు ఇద్దరు స్మగ్లర్లు. ఇలా ఏపీ, ఒడిషాల నుండి కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు తరలిస్తున్నారు. తాజాగ  ఐటీ సిటీ బెంగళూరుకు ఇలాగే రూ.12 కోట్ల విలువచేసే 1500 కిలోల గంజాయిని తరలించారు మోహన్ దాస్, బిష్ణోయ్. స్థానిక గంజాయి సప్లయర్ సల్మాన్ కు అమ్ముతుండగా సమాచారం అందుకున్న బెంగళూరు సిసిబి (సిటీ క్రైమ్ బ్రాంచ్)పోలీసులు మెరుపుదాడి చేసారు. అయితే ఈ దాడి సమయంలో గంజాయి వాహనం వద్ద లేకపోవడంతో బిష్ణోయ్, మోహన్ దాస్ తప్పించుకోగా సల్మాన్ పట్టుబడ్డాడు. 

Read More  జైలులో విరబూసిన ప్రేమ.. పెరోల్ వచ్చి పెళ్లి చేసుకున్న హ‌త్య కేసుల్లో దోషుల జంట..

భారీగా గంజాయి, దాన్ని తరలించేందుకు తయారుచేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్న బెంగళూరు పోలీసులు సల్మాన్ ను విచారించగా బిష్ణోయ్, మోహన్ దాస్ పేర్లు బయటపెట్టాడు. దీంతో విశాఖకు చేరుకున్న బెంగళూరు పోలీసుల బృందం స్థానిక పోలీసుల సాయంతో గంజాయి స్మగ్లర్ల కోసం గాలించారు. ఎట్టకేలకు రెండువారాల తర్వాత బిష్ణోయ్, మోహన్ దాస్ లను అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. 

ఇటీవల ఇలాగే ఉల్లిపాయల లోడ్ మధ్యలో గంజాయి బస్తాలు పెట్టి తరలిస్తుండగా విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. ఓ స్మగ్లింగ్ ముఠా భారీగా గంజాయి విజయవాడకు తరలిస్తున్నట్లు  సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై రెండు వాహనాలను పట్టుకున్నారు. ఓ కారు డిక్కీలో 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అందులోని వారిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇక మరో వాహనంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉల్లిపాయల బస్తాలకింద గంజాయి పెట్టి తరలించినా పోలీసులు గుర్తించారు. గోనెసంచుల్లో 255 కిలోల గంజాయిని ముటగట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. అనుమానంతో ఉల్లిపాయల బస్తాలు తీసిచూసిన పోలీసులకు గంజాయి బస్తాలు పట్టుబడ్డాయి. దీంతో గంజాయి బస్తాలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఇలా రెండు వాహనాల్లో పట్టుబడిన 400కిలోల గంజాయి విలువ రూ.80 లక్షలపైనే వుంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఆరుగురు స్మగ్లర్లను విజయవాడ కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం