మధ్యప్రదేశ్‌ సంక్షోభం: భోపాల్ చేరుకున్న సింధియా వర్గం , స్పీకర్‌ను కలిసే ఛాన్స్

By Siva KodatiFirst Published Mar 13, 2020, 5:11 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌‌లో రాజకీయ సంక్షోభం శుక్రవారం అనూహ్య మలుపు తిరిగింది. బెంగళూరులోని రిసార్ట్‌లో వున్న సింధియా వర్గానికి చెందిన 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు క్యాంప్ నుంచి బయటకు వచ్చారు

మధ్యప్రదేశ్‌‌లో రాజకీయ సంక్షోభం శుక్రవారం అనూహ్య మలుపు తిరిగింది. బెంగళూరులోని రిసార్ట్‌లో వున్న సింధియా వర్గానికి చెందిన 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు క్యాంప్ నుంచి బయటకు వచ్చారు. బెంగళూరు నుంచి వీరంతా కొద్దిసేపటి క్రితమే రాజధాని భోపాల్ చేరుకున్నారు.

అదే సమయంలో  రెబల్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఎయిర్‌పోర్ట్‌ వద్దకు భారీగా చేరుకోవడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.

Also Read:సింథియా నిష్క్రమణ: సచిన్ పైలట్ ట్వీట్‌, కాంగ్రెస్‌లో తీవ్ర చర్చ

రెండు గ్రూపులకు ప్రత్యేక భద్రతను కల్పించారు పోలీసులు. అయితే రాజీనామాలు చేస్తే సరిపోదని, స్వయంగా తన ముందు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇవాళ సాయంత్రం లోపు బీహార్ రావాలని డెడ్‌లైన్ విధించడంతో సింధియా వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భోపాల్ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. 

Also Read:మధ్యప్రదేశ్‌ సంక్షోభం: కమల్‌నాథ్ సర్కార్‌కు 16న బలపరీక్ష..?

22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ సర్కార్ పతనం అంచున నిలబడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శుక్రవారం గవర్నర్‌తో సమావేశమై బలపరీక్షపై చర్చించారు. స్పీకర్ సూచనల మేరకు అసెంబ్లీలో మార్చి 16న విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని కమల్‌నాథ్ స్పష్టం చేశారు.

click me!