హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటి దాడులు: విస్తుపోయే కారణం

By telugu teamFirst Published Jan 16, 2020, 6:08 PM IST
Highlights

హీరోయన్ రష్మిక ఇంటిపై ఐటి దాడుల వెనక కారణం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్నడ మీడియాలో ఇందుకు సంబందించి వార్తాకథనాలు వచ్చాయి. ఐటి దాడుల వెనక రాజకీయ కోణం ఉందని అంటున్నారు.

బెంగళూరు: హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై ఐటి దాడులు జరగడం వెనక కారణంపై కన్నడ మీడియా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. గీతగోవిందం సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అతి త్వరలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. 

రష్మిక తండ్రి మదన్ కాంగ్రెసు నాయకుడు. అందువల్లనే ఆదాయం పన్ను దాడులు జరిగాయని కన్నడ మీడియా భావిస్తోంది. రష్మిక పేరు మీద 50 ఎకరాల కాఫీ తోటను కొనడానికి మదన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంత డబ్బు ఆయనకు ఎలా వచ్చిందనే విషయాన్ని పరిశీలించడానికి ఐటి దాడులు చేసినట్లు చెబుతున్నారు. 

Also Read: రష్మిక ఇంటిపై ఐటీ రైడ్స్.. నిజం కాదంటున్న మేనేజర్!.

కర్ణాటక కాంగ్రెసు నేతలు, మాజీ మంత్రులు డీకె శివకుమార్, కేజే జార్జిలతో మదన్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. మదన్ మందన్న గతంలో విరాజ్ పేట పట్టణ కాంగ్రెసు అధ్యక్షుడిగా, పంచాయతీ సభ్యుడిగా పనిచేశారు. డీకే శివకుమార్ ఇంటి మీద దాడులు చేసిన సమయంలో మదన్ మందన్నకు సంబంధించిన సమాచారం దొరికిందని, అందుకే ప్రస్తుతం ఐటి దాడులు చేశారని అంటున్నారు. 

రష్మిక స్వస్థలం విరాజ్ పేట కొడగు జిల్లాలో కేరళ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. ఈ విరాజ్ పేట పట్టణం కాఫీ తోటలకు ప్రసిద్ధి. విరాజ్ పేట శివారులో ఇప్పటికే రష్మిక పేరు మీద 50 ఎకరాల కాఫీ తోట ఉందని, మరో 50 ఎకరాల కాఫీ తోటను ఆమె పేరు మీద కొనడానికి తండ్రి సన్నాహాలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. 

See Video:హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటి దాడులు.. కారణమిదే..

రష్మిక ఇంటిపై ఐటి దాడులు జరగలేదని ఆమె మేనేజర్ చెబుతున్నారు. అయితే, ఆమె ఆస్తులపై కూడా ఐటి అధికారులు కన్నేసిటన్లు తెలుస్తోంది. మదన్ మందన్న పేర విరాజ్ పేటలో సెరెనిటీ హాల్, కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. పట్టణ సమీపంలోని గోణికొప్ప గ్రామంలో ఓ పాఠశాలను స్థాపించడానికి మదన్ మూడు ఎకరాలు కొనుగోలు చేసినట్లు కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి.

మూడు నెలల క్రితం రష్మిక ఆరు కోట్ల రూపాయల విలువ చేసే కారును కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. రష్మిక 2016లో కిరాక్ పార్టీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసారు. ఈ మూడేళ్ల కాలంలో ఆమె తాను నటించిన సినిమాల ద్వారా ఇంత భారీగా ఎలా సంపాదించారనే కోణంలో ఐటి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

click me!