ఆర్మీడే : కెప్టెన్ తానియా ఆత్మ స్థైర్యానికి ఆనంద్ మహీంద్రా ఫిదా

By telugu teamFirst Published Jan 16, 2020, 1:55 PM IST
Highlights

నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ (csd) బిపిన్ రావత్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు యుద్ధ వీరులకు నివాళులర్పించారు. ఆర్మీ పరేడ్ గ్రౌండ్ లో సైనికుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జవాన్లకుఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే పతకాలు అందజేశారు.

ఆనంద్ మహీంద్రా ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ వ్యాపారవేత్తగా అందరికీ ఆయన సుపరిచతమే. కాగా.... ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. సామాన్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. తనకు నచ్చిన ప్రతి విషయం.. స్ఫూర్తి నింపేది ఏదైనా తన కంట పడితే... దానిని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఆయన ఉండలేరు.

తాజాగా... ఆయన ఆర్మీడేకి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేశారు. ఆ వీడియో చూస్తే తనకు గూస్ బమ్స్ వచ్చాయని చెబుతూ వీడియో షేర్ చేశారు.

Also Read మార్కెట్లో చైనా- అమెరికా ట్రేడ్‌వార్ జోష్.. స్టాక్స్ @ 42కే.. బట్...

ఇంతకీ మ్యాటరేంటంటే... బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీడేని ఘనంగా నిర్వహించారు. నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ (csd) బిపిన్ రావత్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు యుద్ధ వీరులకు నివాళులర్పించారు. ఆర్మీ పరేడ్ గ్రౌండ్ లో సైనికుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జవాన్లకుఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే పతకాలు అందజేశారు.

 

Shattering the glass ceiling and breaking all stereotypes Capt Tanya Shergill becomes the first woman to command the all men contingent on the 72nd Parade.With loads of confidence, poise & her head held high she makes India proud. Video pic.twitter.com/4CX5cIO2SM

— Supriya Sahu IAS (@supriyasahuias)

కాగా... ఈ ఆర్మీడేకి సంబంధించిన ఓ వీడియోని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేశారు. యుద్ధ వీరులకు నివాళులర్పించే క్రమంలో సైనికులు పరేడ్ నిర్వహించడం  సహజమే. అయితే... దీనికి కెప్టెన్ గా తానియా షెర్గిల్ వ్యవహరించారు. అందులో ఆమె ఒక్కత్తే స్త్రీ కావడం గమనార్హం. ఈ వీడియో చూసినప్పుడు తనకు ఒళ్లు పులకరించిందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఎంతో ఆత్మస్థైర్యంతో ఒక లీడర్ గా ఆమె వ్యవహరించిన తీరు.. దేశానికి గర్వకారణం అని ఆయన అన్నారు. ఓ మహిళ అందరు మహిళలను కమాండ్ చేయడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. బుధవారం జరిగిన 72వ ఆర్మీ డే వేడుకల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం. 

click me!