పేటీఎం విజ్ఞప్తిని ఆర్బీఐ మన్నించినట్టేనా? ఆర్బీఐ ఆదేశాలివే

By Mahesh K  |  First Published Feb 23, 2024, 6:10 PM IST

తాము టీపీఏపీగా మారడానికి అవకాశం ఇవ్వాలని, యూపీఐ ఆపరేషన్లు కొనసాగించే అనుమతి ఇవ్వాలని పేటీఎం.. ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిపై ఆర్బీఐ స్పందించింది.
 


Paytm: యూపీఐ ఆపరేషన్లు కొనసాగించడానికి అనుమతించాలని పేటీఎం సంస్థ కేంద్ర బ్యాంకు ఆర్బీఐని విజ్ఞప్తి చేసింది. పేటీఎం విజ్ఞప్తిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌(టీపీఏపీ)గా తమకు అవకాశం ఇవ్వాలని పేటీఎం రిక్వెస్ట్ చేసింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఆర్బీఐ ఆదేశించింది.

ఒక వేళ ఈ విజ్ఞప్తిని మన్నిస్తే.. పేటీఎం యూపీఐ (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా లావాదేవీలను ప్రాసెస్ చేసుకోవచ్చు.

Latest Videos

కొత్తగా గుర్తించిన బ్యాంక్‌లు పేటీఎం యాప్‌కు మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. పేటీఎం బ్యాంక్ ఖాతాదారులు నిరాటంకంగా ఈ బ్యాంక్‌లకు బదిలీ అయ్యేలా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను హ్యాండిల్ చేయాలని పేమెంట్ అథారిటీని ఆర్బీఐ ఆదేశించింది. ముందుగా ఈ యూజర్లు అందరూ మైగ్రేట్ అయ్యే వరకు.. ఆ కొత్త టీపీఏపీ ఏర్పడే వరకు కొత్త యూజర్లను చేర్చుకోరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Also Read: Top Ten News @6PM: ఏషియానెట్‌లో టాప్ 10 వార్తలు

జనవరి 31వ తేదీన ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 15వ తేదీ కల్లా ఈ పేటీఎం పేమెంట్ బ్యాంక్ తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపేసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు సంచలనమయ్యాయి.

click me!