పాకిస్తాన్ వారిని అన్నాచెల్లెళ్లు అన్న యూట్యూబర్ రణవీర్ అల్లహాబాదియా

యూట్యూబర్ రణ్‌వీర్ అల్లహాబాదియా మళ్ళీ వివాదంలో చిక్కుకున్నాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టి దుమారం రేపాడు. తర్వాత పోస్ట్ డిలీట్ చేసినా నెటిజన్లు చీవాట్లు పెట్టారు.

Google News Follow Us

బీర్ బైసెప్స్ అనే పేరుతో యూట్యూబ్ లో పాపులర్ అయిన రణ్‌వీర్ అల్లహాబాదియా ఇప్పుడు పెద్ద దుమారానికి కేంద్రబిందువయ్యాడు. ఇటీవల ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్టు వైరల్ అయ్యింది. ఆ పోస్ట్ లో పాకిస్తాన్ ప్రజల పట్ల సానుభూతి చూపించడమే కాదు, వారికి క్షమాపణలు కూడా చెప్పాడు. ఆ తర్వాత ఆ పోస్ట్ డిలీట్ చేసినప్పటికీ, స్క్రీన్ షాట్లు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు మాత్రం రణ్‌వీర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.తన మాటల్లో ఆయన పాకిస్తాన్ ప్రజలను తమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు అంటూ అభివర్ణించాడు. తాను వాళ్లపై ద్వేషం పెట్టుకోనని, శాంతి కోరికే తనదని చెప్పాడు. తన అభిప్రాయం ప్రకారం, పాకిస్తాన్ లో ప్రజలు కాదు, వారి మిలిటరీ, గూఢచార సంస్థ అయిన ISI అసలు సమస్య అని అన్నాడు. వాళ్లే ఇండియాలో జరిగిన అనేక ఉగ్రదాడులకు కారణమని రణ్‌వీర్ ఆరోపించాడు.

పోస్ట్ డిలీట్ చేసినా...

తన పోస్ట్ లో కొన్ని ఆధారాలు కూడా చేర్చాడు. పాకిస్తాన్ మిలిటరీ నాయకులు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని, ప్రభుత్వమే ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తుందని పేర్కొన్నాడు. అయినప్పటికీ, తాను ప్రజల పట్ల ద్వేషం పెట్టుకోనని, శాంతిని కోరుకుంటున్నానని మరోసారి స్పష్టం చేశాడు.చివరగా, ఇది భారత్ vs పాకిస్తాన్ సమస్య కాదు, భారత ఆర్మీ vs పాకిస్తాన్ మిలిటరీ, ISI మధ్య పోరాటమని తేల్చేశాడు. శాంతి నెలకొాలని ఆశిస్తున్నానని చెప్పాడు. కానీ ఈ మాటలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేశాయి. అతని పోస్టు స్క్రీన్ షాట్లు షేర్ చేస్తూ తిట్లు, విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే గతంలో వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్న రణ్‌వీర్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు.

Read more Articles on