కాంగ్రెస్ నేత సినీనటి రమ్యపై రాజద్రోహం కేసు

By Nagaraju TFirst Published Sep 26, 2018, 5:09 PM IST
Highlights

కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా చీఫ్‌, ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్యకు భారీ షాక్‌ తగిలింది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రమ్య చేసిన ఓ ట్వీట్‌కు ఉత్తరప్రదేశ్ పోలీసులు రాజద్రోహం కింద కేసు నమోదు చేసి షాక్ ఇచ్చారు. మోదీని ఉద్దేశించి రమ్య చేసిన ట్వీట్ పై ఫిర్యాదు చెయ్యడంతో ఉత్తరప్రదేశ్‌లోని గోమతినగర్‌ పోలీసులు ఆమెపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. 

ఢిల్లీ: కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా చీఫ్‌, ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్యకు భారీ షాక్‌ తగిలింది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రమ్య చేసిన ఓ ట్వీట్‌కు ఉత్తరప్రదేశ్ పోలీసులు రాజద్రోహం కింద కేసు నమోదు చేసి షాక్ ఇచ్చారు. మోదీని ఉద్దేశించి రమ్య చేసిన ట్వీట్ పై ఫిర్యాదు చెయ్యడంతో ఉత్తరప్రదేశ్‌లోని గోమతినగర్‌ పోలీసులు ఆమెపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. 

వివరాల్లోకి వెళ్తే ప్రధాని మోదీ తనను పోలిన మరో రూపంపై చోర్‌ అని రాసుకుంటున్నట్టు ఉన్న ఓ మార్ఫింగ్‌ ఫొటోను సెప్టెంబర్ 24న రమ్య ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ట్వీట్ పై లక్నోకు చెందిన న్యాయవాది సయీద్‌ రిజ్వాన్‌ అహ్మద్‌ గోమతినగర్‌ పోలీసులను ఆశ్రయించారు. 

దేశ ప్రధాని ఖ్యాతిని దిగజార్చేలా రమ్య ట్వీట్‌ చేశారని, ప్రధాని పట్ల వారికి గల ద్వేషానికి ఇది నిదర్శనమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఓ నాయకుడిని, దేశ ప్రధానిని అంతర్జాతీయంగా చులకన చేసే విధంగా ట్వీట్‌ చేశారని రిజ్వాన్‌ తన ఫిర్యాదులో తెలిపారు. 

రిజ్వాన్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు రమ్యపై ఐపీసీ సెక్షన్‌ 124-ఏ(రాజద్రోహం)తోపాటు, సెక్షన్‌ 67(ఐటీ యాక్ట్‌) కింద కేసు నమోదు చేశారు. అయితే రాజద్రోహం కేసుపై స్పందించిన రమ్య తనపై కేసు నమోదు అయ్యిందా అయితే మంచిది అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

 

click me!