కాంగ్రెస్ కి షాకిచ్చిన అఖిలేష్ యాదవ్

By ramya neerukondaFirst Published Sep 26, 2018, 4:30 PM IST
Highlights

అఖిలేశ్ యాదవ్ కూడా తన పార్టీ మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

త్వరలో మధ్యప్రదేశ్ లో ఎన్నికల సమరం మోగనుంది. ఈ సమయంలో అఖిలేష్ యాదవ్.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఇంతకీ మ్యాటరేంటంటే.. మధ్యప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలను ఒకే గొడుగు క్రిందికి తేవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఆ ప్రయత్నాలు కాస్త బెడిసి కొడుతున్నాయి.

బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ ప్రతిపాదిత మహాకూటమిలో భాగస్వామి కాబోవడం లేదన్న సంకేతాలను పంపిస్తున్నాయి. బీఎస్‌పీ 22 మంది అభ్యర్థులను ప్రకటించగా, అఖిలేశ్ యాదవ్ కూడా తన పార్టీ మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
 
తమకు 35 స్థానాలు ఇవ్వాలని బీఎస్‌పీ అడుగుతున్నట్లు తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ కనీసం 15 స్థానాలివ్వాలని కోరుతోందని సమాచారం. ఈ పార్టీల డిమాండ్లను కాంగ్రెస్ అంగీకరించడం లేదని సమాచారం.
 
మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలు ఉత్తర ప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నాయి. వీటిలో తన నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి చెప్పుకోదగ్గ మద్దతు ఉందని అఖిలేశ్ విశ్వసిస్తున్నారు. ఈ నెల 29న ఆయన షహదోల్ జిల్లాలోనూ, ఈ నెల 30న బాలాఘాట్‌లోనూ పర్యటించబోతున్నారు. ఆయన గోండ్వానా గణతంత్ర పార్టీ చీఫ్ హీరా సింగ్ మర్కమ్‌తో కలిసి పర్యటిస్తారు.
 
సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిథి డాక్టర్ సునిలమ్ మాట్లాడుతూ తమ పార్టీలో చురుకైన కార్యకర్తలను శాసన సభ ఎన్నికల్లో నిలుపుతామన్నారు. వచ్చే నెల 3న జరిగే సమావేశంలో అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలిస్తామని చెప్పారు

click me!