ఆధార్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు...స్వాగతించిన బిజెపి ఎంపి

By Arun Kumar PFirst Published Sep 26, 2018, 5:08 PM IST
Highlights

భారత ప్రభుత్వం దేశ ప్రజల గుర్తింపు కోసం తీసుకువచ్చిన ఆధార్ కార్డు చట్టబద్దతపై గత కొన్ని రోజులుగా జర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆధార్ నంబర్ పై వున్న అన్ని అనుమానాలను ఇవాళ సుప్రీంకోర్టు పటాపంచలు చేసింది. ఆధార్ డేటా భద్రతపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఆధార్ కు చట్టబద్దత ఉందని సుప్రీం తీర్పునిచ్చింది. అయితే ఈ ఆధార్ నంబరు సిమ్ కార్డు తీసుకోడానికి, ప్రవేట్ సంస్థల్లో, స్కూళ్లలో పిల్లల అడ్మిషన్లకు తప్పనిసరి కాదని షరతులు విధించింది. అయితే పాన్, ఐటీ రిటర్న్ కోసం ఆధార్ నంబర్ తప్పనిసరి అని జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. 

ఈ తీర్పును బిజెపి రాజ్యసభ సభ్యులు రాజీవ్ చంద్రశేఖరన్ స్వాగతించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అవినీతిని అంతం చేయడానికి ఈ ఆధార్ ను ఎంతగానో  ఉపయోగిస్తున్నారని గుర్తుచేశారు. అలాగే ప్రజలకు ప్రభుత్వం అందించే సబ్సిడీలలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఆధార్ నంబరు ఉపయోగపడుతుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉండే దళారి వ్యవస్థ ఈ ఆధార్ ఎంట్రీతో దూరమైందని చంద్రశేఖర్ గుర్తు చేశారు.  

కేంద్ర ప్రభుత్వం ఈ ఆధార్ ఆధారంగానే ఎలాంటి చట్టాలు, చర్చలు, సెక్యూరిటి లేకుండానే నేరుగా ప్రజల వద్దకే పథకాలు తీసుకుపోతున్నారని గుర్తుచేశారు. ఇలా వేల కోట్లు నేరుగా ప్రజల వద్దకు చేరుతున్నట్లు ఎంపీ వివరించారు. అలాగే జన్ ధన్ యోజనలోనూ దీన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా వున్న కాలంలో  దేశ ప్రజలకు ఓ ప్రత్యేక గుర్తింపు కార్డు ఉండాలనే ఆలోచనకు బీజం పడినట్లు ఎంపీ గుర్తుచేశారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలాంటి చట్టబద్దత లేని ఆధార్ ఆధారంగానే వందల, వేల కోట్లు ఎలా ఖర్చుచేస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆకోపిస్తున్నారు. ఇలా విమర్శించే వారికి సుప్రీం తీర్పు పెద్ద గుణపాఠం అని చంద్రశేఖరన్ అన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో ప్రజలకు అందాల్సిన సబ్సిడీలలో తీవ్రంగా అవినీతి జరిగేది. దీన్ని రూపుమాపడానికి వాజ్ పేయి ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రజలకు గుర్తింపు కార్డు ఇవ్వాలని 2001 లోనే ప్రయత్నించినట్లు ఎంపి తెలిపారు.  దేశాన్ని దాదాపు 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా ఆ దిశగా ఆలోచించిందా అని ఆయన ప్రశ్నించారు.    

తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో అవినీతి అంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజలకు అందాల్సిన పథకాలు నేరుగా వారివద్దకే చేరతాయని దీని ద్వారా ప్రజాధనం వృధా కాదని చంద్రశేఖరన్ వివరించారు.  ఇలా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. 
 
click me!