ఖలిస్తానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun)మరో సారి భారత్ పై విషం చిమ్మాడు. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ( Ayodhya Ram Mandir Opining) సమయంలో విమానాశ్రయాలను మూసివేయాలని ఆయన ముస్లింల (Muslims)కు పిలుపునిచ్చారు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 22వ తేదీన రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమంపై సిక్కుస్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదుపై నిర్మించిన మందిర ప్రారంభోత్సవ వేడుకను వ్యతిరేకించాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు.
వెంటనే మసీదులు ఖాళీ చేయండి.. లేకపోతే - బీజేపీ నేత ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు..
undefined
‘న్యూస్ 18’ కథనం ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోడీని పన్నూన్ ముస్లింలకు ప్రపంచ శత్రువుగా అభివర్ణించారు. బలవంతంగా మతమార్పిడులకు గురైన వేలాది మంది ముస్లింల మృతదేహాలపై ఆలయాన్ని నిర్మించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని రామ మందిరంలో జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత అపవిత్రమైనదని అన్నారు. దైవభక్తి లేని, అధర్మ వేడుక అని ఆయన అన్నారు. జనవరి 22వ ప్రధాని మోడీ ముస్లింలకు వ్యతిరేకంగా జరిపై ‘ఆపరేషన్ బ్లూస్టార్’ అని ఆరోపించారు.
తెలంగాణకు మోడీ: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో విమానాశ్రయాలను మూసివేయడానికి తనకు ముస్లింలు సహాయం చేయాలని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కోరారు. ముస్లింలు భారత్ నుంచి 'ఉర్దిస్తాన్' దేశాన్ని విడదీయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. లేకపోతే మోడీ నేతృత్వంలోని హిందూ ప్రభుత్వం ప్రతీ ముస్లింను బలవంతంగా మతమార్పిడి చేస్తుందని హెచ్చరించారు.
పన్నూన్ వ్యాఖ్యల నేపథ్యంలో భద్రతా బలగాలు అలెర్ట్ అయ్యాయి. ఎలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నాయి. కాగా.. ప్రత్యేక ఖలిస్తాన్ కోసం రెఫరెండం ప్రారంభించడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఆందోళనలో ఉన్నాడని, అందుకే ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పన్నూన్ ప్రయత్నిస్తున్నారని భారత నిఘా వర్గాలు సూచిస్తున్నాయి.
మళ్లీ షేక్ హసీనాకే బంగ్లాదేశ్ పగ్గాలు.. ఎన్నికల్లో నాలుగోసారి ఘన విజయం..
ఇదిలా ఉండగా.. అమెరికా పౌరుడు, న్యాయవాది అయిన పన్నూన్.. నిజ్జర్ మృతిపై కెనడా, యూకే, అమెరికాలోని భారత కాన్సులేట్లు, రాయబార కార్యాలయాలను బెదిరించారు. గత ఏడాది ఒట్టావాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, టోరోంట్ కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవల ఫోటోలను ఒక పోస్టర్ లను సర్క్యులేట్ చేశాడు. అయితే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద పన్నూన్ ను 2020లో భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది.