ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు పాట : రామ్ చరణ్ భార్య ఉపాసన రియాక్షన్ ఏంటంటే..

Published : Mar 13, 2023, 09:50 AM IST
ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు పాట : రామ్ చరణ్ భార్య ఉపాసన రియాక్షన్ ఏంటంటే..

సారాంశం

త్రిబుల్ ఆర్ పాట నాటు నాటు ఆస్కార్ గెలవడంతో రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని సంతోషంతో.. అవార్డు వేడుక నుండి తన అభిమానుల కోసం ఫొటోలు షేర్ చేశారు. 

న్యూఢిల్లీ : 95వ అకాడమీ అవార్డ్స్‌లో తెలుగు పాట నాటు నాటు సంచలనం సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరిలో ఆర్‌ఆర్‌ఆర్ లోని పాట ఆస్కార్ గెలుచుకుని..  భారతదేశం మరోసారి గర్వపడేలా చేసింది. ఈ సంతోష సందర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని అవార్డు వేడుక వేదిక దగ్గర్నుండి కొన్ని ఫొటోలో తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు.

ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఉపాసన ఫాలోవర్స్ కు ఆస్కార్ వేడుకలోని ముఖ్యమైన ఘట్టాలను ఫొటోల రూపంలో షేర్ చేశారు. దర్శకుడు ఎస్ ఎస్  రాజమౌళి, అతని భార్య రమా రాజమౌళి.. రామ్ చరణ్.. మిగతావారితో చాలా ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫొటోలలో త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.  ఈ ఫొటోలో త్రిపుల్ ఆర్ స్టార్ రామ్ చరణ్ నలుపురంగు సంప్రదాయ దుస్తుల్లో, ఉపాసన స్టేట్‌మెంట్ జ్యువెలరీతో జత చేసిన వైట్ క్రీమ్ చీరలో అందంగా కనిపిస్తుంది. 

Naatu Naatu wins Oscar: జయహో ఆర్ ఆర్ ఆర్... నాటు నాటు కి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు

ఇక రాజమౌళి ధోతీ కుర్తా సెట్‌లో ఎప్పటిలాగే చిరునవ్వుతో సాంప్రదాయకంగా ఉన్నారు. అతని భార్య రమా రాజమౌళి గులాబీ రంగు చీరలో కనిపిస్తున్నారు. వీరు నలుగురు కలిసి దిగిన ఫొటోను ఉపాసన షేర్ చేస్తూ... దీనికి క్యాప్షన్‌గా ఇలా పేర్కొంది : "ఆస్కార్ ప్రేమ. ధన్యవాదాలు రాజమౌళి గారూ..కుటుంబసమేతంగా ఆస్కార్ వేదిక మీద ఉన్నాం. జై హింద్’ అంటూ పోస్ట్ షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ పాటలోని వైరల్ ట్రాక్ నాటు నాటు ఆస్కార్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరిలో అవార్డు గెలుచుకుంది. 

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌గా కార్తికీ గొన్సాల్వ్స్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' గెలుచుకుంది. దీని తరువాత దేశానికి వచ్చిన రెండో అవార్డు నాటు నాటు పాటకే. ఈ పాటను నాటు నాటు గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆస్కార్ వేదిక మీద లైవ్ ప్రదర్శించారు. దీనికి ప్రేక్షకుల నుండి అనేక ప్రశంసలు అందుకున్నారు. దీపికా పదుకొణే ప్రదర్శనను పరిచయం చేస్తూ, "ఎలక్ట్రిఫైయింగ్ బీట్‌లు, కిల్లర్ డ్యాన్స్ మ్యాచ్‌లు ఈ పాటను ప్రపంచ సంచలనం చేశాయి’’ అని చెప్పారు. ఈ పాట యూట్యూబ్, టిక్ టాక్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించింది," అని దీపిక చెప్పుకొచ్చారు. ఇక RRRలో అలియా భట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అలిసన్ డూడీ మరియు రే స్టీవెన్సన్ కూడా నటించారు.

 

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu