Raksha Bandhan: దేశ సౌభ్రాతృత్వం, మత సంబంధాల బలోపేతమే రక్షా బంధన్

By Asianet News  |  First Published Sep 1, 2023, 1:47 PM IST

Raksha Bandhan: రక్షా బంధన్ అనే అందమైన పండుగను శతాబ్దాలుగా మన దేశంలో ఎంతో ఉత్సాహంతో సోదర సోదరీమణుల ప్రేమతో జరుపుకుంటారు. ఈ పండుగకు సంబంధించిన హిందూ-ముస్లిం సోదరభావానికి సంబంధించిన అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ కథలు ఆధునిక భారతదేశంలోని రెండు విభిన్న వర్గాల మధ్య మత సామరస్యం, ఐక్యత గురించి తెలియజేస్తున్నాయి.


Raksha Bandhan: అన్నచెల్లెల బంధం చాలా అపురూపమైనది. ప్రేమ, మద్దతు, స్నేహం ఈ బంధంలో ఇమిడి ఉంటాయి. వారి బంధాన్ని మరింత బలోపేతం చేసే పండుగే రక్షా బంధన్. ఈ పర్వ దినం సోదరులు, సోదరీమణుల మధ్య బంధాన్ని మరింత  బలోపేతం చేస్తుంది. రక్షా బంధన్  పండుగను శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ పండుగను మొత్తం భారత ఉపఖండంలో జరుపుకునే గొప్ప ప్రాముఖ్యత కలిగిన పండుగ ఇది. శబ్దవ్యుత్పత్తి ప్రకారం.. రక్ష అంటే "రక్షణ", బంధన్ అంటే బంధం బలోపేతం(సోదర-సోదరీ బంధం). సోదర సోదరీమణుల మధ్య పరస్పర రక్షణ, మద్దతు,స్నేహపూర్వక అవగాహనను కల్పిస్తోంది. బంధాన్ని బలోపేతం చేస్తోంది.  రక్షాబంధన్ నాడు.. సోదరీమణులు తన సోదరుల చేతికి రాఖీ అనే దారాన్ని కట్టారు. ఈ అందమైన రాఖీ .. వారికి రక్షణగా కాపాడుతుందని నమ్ముతారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణుల ఆనందం, దుఃఖం రెండింటిలోనూ అండగా ఉంటామని ప్రమాణం చేస్తారు.

ఇస్లాంలో కూడా రక్షా బంధన్ లాంటి ప్రస్తవన ఉంది. అదే సిలా రహ్మి (బంధాలను బలోపేతం చేయడం). ఈ ఇస్లామిక్ భావన ప్రవక్త మొహమ్మద్ కుటుంబ సభ్యులందరితో ముఖ్యంగా సోదరులు, సోదరీమణుల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కొన్ని నియమాలను కూడా సూచించారు. అందులో ఒకటి: “పేదలకు ఇచ్చే దాన ధర్మం (సదఖా) చేయడం, కానీ ఇది సాధారణ చర్యే. అయినప్పటికీ చర్య బంధాలను బలోపేతం చేస్తుందని భావించారు. అదే విధంగా సోదరుడు, సోదరికి ఏదైనా బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల ఆ బంధం మరింత పెరుగుతోందని భావించారు. ఈ చర్య ద్వారా కుటుంబ బంధాలు కూడా బలోపేతం అవుతాయని భావించారు. 

Latest Videos

undefined

అలాగే.. ప్రవక్త ముహమ్మద్ తోబుట్టువుల శత్రుత్వం లేదా అసూయ గురించి హెచ్చరించాడు. ఇది కొన్నిసార్లు వినాశకరమైన ఫలితానికి దారితీసే ఖతా అల్-రహ్మ్ (కుటుంబ సంబంధాలను తెంచుకోవడం) అననుకూల ఫలితాలను ఇస్తుందని అన్నారు. వాస్తవానికి.. తోబుట్టువుల శత్రుత్వం అనేది ఒక అంతర్నిర్మిత మానవ భావోద్వేగం. ఇది ఇతర తోబుట్టువుల కంటే తల్లిదండ్రుల కరుణ, శ్రద్ధ లేదా ప్రాధాన్యత కోసం పోటీపడినప్పుడు నైతిక లోపంగా మారుతుంది. అటువంటి అసూయ అనేది స్వాభావికమైన,అనివార్యమైన లక్షణం, ఇది అసూయ (హసద్) వికారమైన రూపాన్ని తీసుకునే వరకు విస్మరించబడుతుంది. ఇది ఏ విధంగానూ ఆరోగ్యకరమైనది, సానుకూలమైనది కాదు. ప్రవక్త ఇలా హెచ్చరించారు. “అసూయ పట్ల జాగ్రత్త వహించండి. ఎందుకంటే.. అగ్ని చెక్కను ఎలా దహించినట్లే.. అసూయ మనల్ని కూడా అలా దహించిస్తోంది." అదే సమయంలో.. ప్రవక్త వారి పిల్లలకు కుమారులు, కుమార్తెలకు సమాన హక్కులు, కరుణను కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. 

విద్వేషాలకు విరుద్ధంగా.. రక్షా బంధన్ నాడు సోదరులకు రాఖీ కట్టడం ద్వారా తమ సోదరీమణుల పట్ల తమ ప్రేమ, శ్రద్ధను వ్యక్తం చేస్తారు. వారు నగదు రూపంలో బహుమతులు, బట్టలు, పరిమళ ద్రవ్యాలు మొదలైనవాటిని అందిస్తారు సోదరులు. తోబుట్టువులతో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సంబంధాలను బలోపేతం చేయడానికి, తోబుట్టువుల మధ్య పోటీని తగ్గించడానికి అద్భుతమైన మార్గం. ప్రవక్త ఇలా అన్నారు "ఒకరితో ఒకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోండి. మీరు మీ మధ్య ప్రేమ, సద్భావనను సృష్టిస్తారు." అని పేర్కొన్నారు. 

రక్షా బంధన్ అనే అందమైన పండుగను శతాబ్దాలుగా మన దేశంలో ఎంతో ఉత్సాహంతో సోదర సోదరీమణుల ప్రేమతో జరుపుకుంటారు. ఈ పండుగకు సంబంధించిన హిందూ-ముస్లిం సోదరభావానికి సంబంధించిన అనేక కథలు కూడా ప్రాచుర్యం పొందాయి. ఈ కథలు మనకు ఆధునిక భారతదేశంలోని రెండు విభిన్న వర్గాల మధ్య మత సామరస్యం, ఐక్యత గురించి తెలియజేస్తాయి. వారి మధ్య సహోదరత్వం, సద్భావనలను పునర్నిర్మించటానికి, బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాయి. మెజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య సత్సంబంధాలు.  రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రతికూలంగా ప్రభావితమవుతున్న తరుణంలో రక్షా బంధన్ పండుగకు సంబంధించిన  పలు కథనాలు పరస్పర గౌరవం, అవగాహనను కల్పిస్తుంటాయి. 

1905లో భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనను ప్రకటించినప్పుడు.. ఈ నిర్ణయం దేశాన్ని ముక్కలు చేసింది. లార్డ్ కర్జన్  రెండు దేశాల సిద్ధాంతాన్ని సమర్థించే కొంతమంది నాయకుల మధ్య జరిగిన సమావేశంలో చర్చల తర్వాత ఈ విభజన జరిగింది. ఈ సమావేశంలో ముస్లింలను గుర్తించేందుకు ప్రత్యేక దేశం ఆవశ్యకతను వివరించారు. అస్సాంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటం.. అలాగే.. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలోని హిందూ మెజారిటీ ప్రాంతాల నుండి వారిని వేరు చేయాలని కర్జన్ భావించారు.  ఆ విధంగా.. ఈ ఉత్తర్వు ఆగస్టు 1905లో ఆమోదించబడింది. ఇది 16 అక్టోబర్ 1905 నుండి అమల్లోకి వచ్చింది.

భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు, కవి-తత్వవేత్త రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసిన 'విభజించు-  పాలించు' అని సిద్దాంత ఉద్దేశాన్ని గ్రహించి.. దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ-ముస్లిం సంబంధాలను బలోపేతం చేయడానికి రాఖీ సంప్రదాయాన్ని (ఆయుధం)గా భావించారు. జాతీయ సమైక్యత, మత సామరస్యం, సోదర స్ఫూర్తితో ఒకరికొకరు రాఖీ కట్టుకోవాలని ప్రోత్సహించారు. ప్రతి హిందువు ప్రతి తోటి ముస్లింకి రాఖీ కట్టాడు. ఈ సందర్భంలో ముస్లింలు,హిందూవులు సోదరభావంతో రాఖీలు కట్టున్నారు.ఇది చారిత్రక దృశ్యం.  

స్వాతంత్రోద్యమ సమయంలోగానే సోదరులు, సోదరీమణులుగా భారతీయ ముస్లింలు,హిందువులు ఈ కష్ట సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మతపరమైన ప్రాతిపదికనలు ఈ సోదర,సోదరీమణుల భావాన్ని ఎప్పుడూ బాధించకూడదు. తోబుట్టువుల్లా ఇరువురు కష్టకాలంలో కలిసి ఉండాలని, సుఖసంతోషాలను పంచుకోవాలి. ఇలా చేయడం వల్ల  బలమైన,ఆరోగ్యకరమైన హిందూ-ముస్లింల సోదరభావం నెలకొంటుంది. తోబుట్టువులకు ఎల్లప్పుడూ అండగా ఉండాలి. వారిలో తప్పులో ఉంటే..సర్దిచెప్పాలి. దీంతో వారు నేర్చుకుంటారు, తప్పులను సరిదిద్దుకుంటారు. ఈ రాఖీ పూర్ణిమ సందర్భంగా మనం ఒకరినొకరు క్షమించుకోవాలి. ఈ రాఖీ సంప్రదాయం సోదరులు, సోదరీమణుల మధ్య ప్రేమ, నమ్మకాన్ని సూచిస్తుంది. వారి సంబంధాలను మెరుగుపరుస్తోంది.  

రచయిత- గులాం రసూల్ దేహ్ల్వి (న్యూ ఢిల్లీ).
 

click me!