రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్ధి బీకే హరిప్రసాద్ నామినేషన్ దాఖలు

First Published Aug 8, 2018, 12:29 PM IST
Highlights

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  తన అభ్యర్ధిగా  బీకే హరిప్రసాద్‌తో బుధవారంనాడు నామినేషన్ దాఖలు చేయించింది. ఎన్డీఏ అభ్యర్థిగా జేడీ(యూ) నేత  హరివంశ్ నారాయణసింగ్  నామినేషన్ దాఖలు చేశారు.


న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  తన అభ్యర్ధిగా  బీకే హరిప్రసాద్‌తో బుధవారంనాడు నామినేషన్ దాఖలు చేయించింది. ఎన్డీఏ అభ్యర్థిగా జేడీ(యూ) నేత  హరివంశ్ నారాయణసింగ్  నామినేషన్ దాఖలు చేశారు.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలు ఆగష్టు 9వ తేదీన జరగనున్నాయి.ఈ ఎన్నికలను పురస్కరించుకొని ఎన్డీఏ అభ్యర్ధిగా జేడీ(యూ) ఎంపీ హరివంశ్ నారాయణసింగ్‌ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ  అభ్యర్ధిగా  బీకే హరిప్రసాద్ ను  కాంగ్రెస్ పార్టీ  నామినేషన్ దాఖలు చేసింది.

కర్ణాటక రాష్ట్రం నుండి బీకే హరిప్రసాద్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విపక్షాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దతివ్వనున్నాయి.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి.  అయితే ఎన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నాయనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవి దక్కాలంటే  సుమారు 123 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంది. అయితే  రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక విషయంలో  టీఆర్ఎస్, బీజేడీ, శివసేన లాంటి పార్టీలు కీలకపాత్ర పోషించనున్నాయి.  

రాజ్యసభలో  కాంగ్రెస్ పార్టీకి 50 మంది సభ్యులున్నారు.  టీఎంసీకి 14 మంది, సమాజ్‌వాదీపార్టీకి 13, టీడీపీకి6, సీపీఎంకు5, సీపీఐకు 2, ఎన్సీపీకి4, బీఎస్పీకి4, ఆర్జేడీకి 5, పీడీపీకి ఇద్దరు, జేడీ(ఎస్)‌కు ఒక్క సభ్యుడు ఉన్నారు. 

ఈ వార్తలు చదవండి: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏకు జగన్ షాక్

                                 రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలు: కేసీఆర్‌కు నితీష్ ఫోన్

click me!