దేవుడంటే పడని కరుణానిధి.. దేవాలయాల పునర్నిర్మాణానికి సీఎంగా సంచలన నిర్ణయాలు

First Published Aug 8, 2018, 11:09 AM IST
Highlights

మన సమాజంలో దేవుడిని నమ్మేవారు.. నమ్మనివారు రెండు రకాలు ఉంటారు. నాస్తికులు తాము ఎలాగూ నమ్మరు... ఎదుటి వ్యక్తిని కూడా దెబ్బిపొడిచేలా మాట్లాడుతుంటారు. కానీ నాస్తికుడైన కరుణానిధి మతపరమైన విషయాల్లో మరో కోణం చూపించారు

మన సమాజంలో దేవుడిని నమ్మేవారు.. నమ్మనివారు రెండు రకాలు ఉంటారు. నాస్తికులు తాము ఎలాగూ నమ్మరు... ఎదుటి వ్యక్తిని కూడా దెబ్బిపొడిచేలా మాట్లాడుతుంటారు. కానీ నాస్తికుడైన కరుణానిధి మతపరమైన విషయాల్లో మరో కోణం చూపించారు. కలైంజర్‌కి మతపరమైన సిద్ధాంతాలపై నమ్మకం ఉండేది కాదు.. కానీ రాష్ట్రంలో శిథిలమవుతున్న ఆలయాలను జీర్ణోద్ధరణ చేసిన ఘనత మాత్రం ఆయనకే దక్కుతుంది.. ఆలయాల పునర్నిర్మాణాల కోసం ముఖ్యమంత్రి హోదాలో రూ.420 కోట్లును ఖర్చు చేశారు.

అంతేకాదు.. కరుణానిధి నివాసం పక్కనే శ్రీకృష్ణుడి ఆలయం ఉంది. ఆయన ఇంటికి పూజారులు వస్తుండేవారు. ఒకానొక సమయంలో కరుణానిధి ఇంట్లో పూజలు జరిగిన వీడియో ఒకటి వైరల్ అవ్వడంతో పాటు కరుణానిధిపై విమర్శల వర్షం కురిసింది.. పైకి నాస్తికుడినని చెప్పుకుంటూ... పూజలు చేయడం ఏంటని విమర్శలు కురిపించారు.

వాటిని ఖండించిన కరుణ... నేను దేవుడిని నమ్మనంత మాత్రాన.. డీఎంకే పార్టీ కానీ.. నా చుట్టు ఉన్నవారు కానీ.. నా దారిలో నడవాల్సిన అవసరం లేదు.. నా కుటుంబసభ్యులపై కూడా ఎలాంటి ఆంక్షలు ఉండవు.. ఎవరి నమ్మకాలు వారివేనని తెలిపారు. అంతేకాదు.. ఎన్నికలకు ముందు, తర్వాత పార్టీ నేతలతో కలిసి దేవాలయాలను దర్శించేవారట.

click me!