కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికకు దూరం

First Published Aug 9, 2018, 10:50 AM IST
Highlights

 రాజ్యసభ డిప్యూటీ  ఛైర్మెన్  ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి ఆప్ షాకిచ్చింది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆప్ నిర్ణయం తీసుకొంది.  ఎన్డీఏ, యూపీఏ పక్షాలకు ఎవరికీ మద్దతివ్వకూడదని నిర్ణయం తీసుకొన్నందున  ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆప్ నిర్ణయం తీసుకొంది.
 


న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ  ఛైర్మెన్  ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి ఆప్ షాకిచ్చింది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆప్ నిర్ణయం తీసుకొంది.  ఎన్డీఏ, యూపీఏ పక్షాలకు ఎవరికీ మద్దతివ్వకూడదని నిర్ణయం తీసుకొన్నందున  ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆప్ నిర్ణయం తీసుకొంది.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిగా బీకే  హరిప్రసాద్ ను బరిలోకి దింపింది. ఎన్డీఏ అభ్యర్థిగా  జెడి(యూ) నేత  హరివంశ్ నారాయణ సింగ్‌ బరిలోకి దిగారు.  అయితే విపక్షాల అభ్యర్ధిగా బరిలో ఉన్న బీకే హరిప్రసాద్‌కు ఆప్ మద్దతిస్తుందని భావించినా  చివరకు ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని ఆప్ నిర్ణయం తీసుకొంది.

కాంగ్రెస్ పార్టీ తమ ప్రతిపాదనలను పట్టించుకోనందున  ఓటింగ్‌కు దూరంగా  ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రకటించారు. జేడీ(యూ) అధినేత, బీహార్ సీఎం తమకు మద్దతివ్వాలని ఫోన్ చేసినట్టు కూడ ఆప్ ఎంపీ సంజయ్ చెప్పారు. 

 బీజేపీతో కలిసి ఉన్నందున తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని తమ పార్టీ చీఫ్  అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.ఆప్ కు రాజ్యసభలో  ముగ్గురు సభ్యులున్నారు.  ఇద్దరు సభ్యులున్న వైసీపీ కూడ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

 ఈ వార్తలు చదవండి: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలు: ఓటింగ్‌కు దూరంగా వైసీపీ

                                    కాంగ్రెస్‌కు విపక్షాలు షాక్: ఎన్డీఏ అభ్యర్థికే ఛాన్స్ 

click me!