మోడీపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్: తిరస్కరించిన వెంకయ్య నాయుడు

Published : Mar 23, 2022, 04:13 PM IST
మోడీపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్: తిరస్కరించిన వెంకయ్య నాయుడు

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టీఆర్ఎస్ ఎంపీలు ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ ను రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు తిరస్కరించరారు. గత నెల 10వ తేదీన టీఆర్ఎస్ ఎంపీలు ఈ నోటీసులు ఇచ్చారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి Narendra Modiపై TRS ఎంపీలు ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ నోటీసును రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. Telangana రాష్ట్ర ఏర్పాటు విషయమై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ  ప్రధానిపై టీఆర్ఎస్ ఎంపీలు Privilege Motion నోటీసు ఇచ్చారు. ఈ ఏడాది గత నెల 10వ తేదీన టీఆర్ఎస్ ఎంపీలు ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్ notice ఇచ్చారు.ఈ నోటీసును తిరస్కరిస్తున్నట్టుగా రాజ్యసభ చైర్మెన్ Venkaiah Naidu ఇవాళ ప్రకటించారు.

President Kovind ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో తమ పార్టీ మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కానీ ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. కానీ ఏపీ రాష్ట్ర విభజన సమయంలోనే వివాదం నెలకొందన్నారు.

ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య గొడవలున్నాయన్నారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును Parliament లో  పాస్ చేసే సమయంలో పార్లమెంట్ తలుపులు మూశారని ఆయన విమర్శించారు. మైకులు కూడా కట్ చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా అని మోడీ ప్రశ్నించారు. మోగీ వ్యాఖ్యలను Congress,టీఆర్ఎస్ సభ్యులు తప్పు బట్టారు. ప్రధాని వ్యాఖ్యలపై రాజ్యసభ సెక్రటరీకి గత నెల 10వ తేదీన ప్రివిలేజ్ మోషన్ నోటీసును ఇచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్