ఉత్తరాఖండ్‌ సీఎంగా Pushkar Singh Dhami ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు

Published : Mar 23, 2022, 03:46 PM IST
ఉత్తరాఖండ్‌ సీఎంగా Pushkar Singh Dhami ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు

సారాంశం

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామీ (Pushkar Singh Dhami) నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ (Uttarakhand ) గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మిత్ సింగ్ (Gurmit Singh).. పుష్కర్ సింగ్ ధామీ చేత ప్రమాణం చేయించారు. 

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామీ (Pushkar Singh Dhami) నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ (Uttarakhand ) గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మిత్ సింగ్ (Gurmit Singh).. పుష్కర్ సింగ్ ధామీ చేత ప్రమాణం చేయించారు. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఈ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సినీయర్ నాయకులు యోగి ఆదిత్యనాథ్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, ప్రమోద్‌ సావంత్‌, మీనాక్షి లేఖి, వసుంధరరాజే.. హాజరయ్యారు.  

పుష్కర్ సింగ్ ధామీతో పాటు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసినవారిలో సత్పాల్ మహరాజ్, సుబోధ్ ఉనియాల్, ధన్ సింగ్ రావత్, రేఖా ఆర్య, గణేష్ జోషి, చందన్ రామ్ దాస్, సౌరభ్ బహుగుణ (Saurabh Bahuguna), ప్రేమ్ చంద్ అగర్వాల్ ఉన్నారు. 

ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు బీజేపీ 47 స్థానాల్లో విజయం సాధించింది. ఖటిమా నియోజకవర్గం నుంచి పోటీసిన పుష్కర్‌ సింగ్‌ ధామి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి భువన్‌ చంద్ర కప్రి చేతిలో 6,579 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థిపై కొద్దిరోజులుగా ఉత్కంఠ కొనసాగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కూడా మరోమారు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు పుష్కర్ సింగ్ ధామికి బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది. సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి నేతృత్వంలో జరిగిన బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పుష్కర్ సింగ్ ధామీ రెండోసారి ఉత్తరాఖండ్ సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం