ప్రేమ పేరిట శారీరకంగా వాడుకొని.. 40మందికి వల వేసిన మోడల్..!

Published : Mar 23, 2022, 03:32 PM IST
 ప్రేమ పేరిట శారీరకంగా వాడుకొని.. 40మందికి వల వేసిన మోడల్..!

సారాంశం

అమాయకు అమ్మాయిలకు ప్రేమ పేరిట వల వేసి వారిని శారీరకంగా వాడుకుంటాడు. కాగా.. మాయగాడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. 

పేరుకి అతను ఓ మోడల్. కానీ చేసేవన్నీ నీచమైన పనులే. అమాయకు అమ్మాయిలకు ప్రేమ పేరిట వల వేసి వారిని శారీరకంగా వాడుకుంటాడు. కాగా.. మాయగాడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన తమిళనాడు లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానిక పురుషవాక్కం మిల్లర్స్‌రోడ్డు ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ సయీద్‌(26) మోడలింగ్‌ చేస్తున్నాడు. ఇటీవల ముగ్గురు యువతులు మహమ్మద్‌ సయీద్‌ తమను మోసం చేశాడంటూ.. గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం సయీద్‌పై నిఘాపెట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 

సుమారు 40 మంది యువతులు ఈ మాయగాడి వలలో చిక్కుకున్నారని తేలింది. బాధితుల్లో చాలామంది అతనిపై కోపంతో రగిలిపోతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు సోమవారం రాత్రి సయీద్‌ను అరెస్టు చేశారు. విచారణలో సయీద్‌ కూడా తాను చేసిన మోసాలను అంగీకరించాడు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మరో అల్పపీడనం రెడీ .. ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు
Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!