అగ్రకులాల పైశాచికం: ఎస్సీ పెళ్లి ఊరేగింపుపై రాజ్‌పుత్‌ల దాడి

Siva Kodati |  
Published : Feb 12, 2019, 10:42 AM IST
అగ్రకులాల పైశాచికం: ఎస్సీ పెళ్లి ఊరేగింపుపై రాజ్‌పుత్‌ల దాడి

సారాంశం

రాజస్థాన్‌లో అగ్రకులాలకు చెందిన వారు రెచ్చిపోయారు. వెనుకబడిన వర్గాలకు చెందిన పెళ్లి ఊరేగింపుపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. దుగార్ గ్రామానికి చెందని సవాయ్ రామ్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి.. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇతనికి కొద్దిరోజుల క్రితం పెళ్లి కుదరడంతో సోమవారం పెళ్లి వేడుక వద్దకు ఊరేగింపుగా వెళుతున్నాడు. ఈ క్రమంలో రాజ్‌పుత్ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కత్తులు, కర్రలతో పెళ్లి ఊరేగింపుపై దాడి చేశారు.

ఈ ఘటనలో పెళ్లికి వచ్చిన కొందరు అతిథులు గాయపడ్డారు. వరుడు సవాయ్ రామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 12 మంది రాజ్‌పుత్‌లపై కేసులు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?