ఢిల్లీలో అగ్నిప్రమాదం: 17కి చేరిన మృతుల సంఖ్య

Siva Kodati |  
Published : Feb 12, 2019, 10:12 AM IST
ఢిల్లీలో అగ్నిప్రమాదం: 17కి చేరిన మృతుల సంఖ్య

సారాంశం

దేశరాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 17కి చేరింది. కరోల్‌బాగ్‌ ప్రాంతంలోని అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 

దేశరాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 17కి చేరింది. కరోల్‌బాగ్‌ ప్రాంతంలోని అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చూస్తుండగానే క్షణాల్లో మంటలు హోటల్ మొత్తం వ్యాపించాయి.

తొలుత మంటల్లో చిక్కుకుని 9 మంది సజీవదహనం కాగా, మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే హోటల్ గదుల్లో కొందరు చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు వారిని కాపాడటానికి శ్రమించాయి. అయినప్పటికి 8 మంది అగ్గికి ఆహుతయ్యారు. సుమారు 26 ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu