తెరచుకోనున్న అయ్యప్ప ఆలయం: శబరిమలలో ఉద్రిక్త పరిస్ధితులు

Siva Kodati |  
Published : Feb 12, 2019, 10:17 AM IST
తెరచుకోనున్న అయ్యప్ప ఆలయం: శబరిమలలో ఉద్రిక్త పరిస్ధితులు

సారాంశం

శబరిమల అయ్యప్ప ఆలయం మరోసారి తెరచుకోనుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోనున్నాయి. మలయాళ నెల కుంభం సందర్భంగా ఈ నెల 12 నుంచి 17 వరకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు.

శబరిమల అయ్యప్ప ఆలయం మరోసారి తెరచుకోనుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోనున్నాయి. మలయాళ నెల కుంభం సందర్భంగా ఈ నెల 12 నుంచి 17 వరకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు.

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం పట్టుదలతో ఉండటం, న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తామని ట్రావెన్ కోర్ బోర్డ్ కూడా ప్రకటించడంతో మహిళలను అడ్డుకునేందుకు అయ్యప్ప భక్తులు, సాంప్రదాయవాదులు సిద్ధమయ్యారు. దీంతో శబరిమల పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిణామాలకు దారి తీయనుందోనని ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

PREV
click me!

Recommended Stories

మెల్‌బోర్న్‌ లో మోదీ క్రేజ్ చూసి ఆస్ట్రేలియా ప్రధాని షాక్ | PM Modi in Australia: Melbourne
ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi arrives in Melbourne, Australia