తమిళనాడు సీఎం పళని స్వామి ప్రభుత్వంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫైరయ్యారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్రంలో కఠినంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ మద్యం దుకాణలు తెరవటంపై సూపర్‌స్టార్ అభ్యంతరం తెలిపారు
తమిళనాడు సీఎం పళని స్వామి ప్రభుత్వంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫైరయ్యారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్రంలో కఠినంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ మద్యం దుకాణలు తెరవటంపై సూపర్‌స్టార్ అభ్యంతరం తెలిపారు.
Also Read:సీఎంలతో మోడీ రేపు వీడియో కాన్పరెన్స్: లాక్‌డౌన్‌పైనే చర్చ
ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలే కానీ మద్యం షాపులు తెరవాలనుకోవడం సరికాదని రజనీ హితవు పలికారు. ఒకవేళ లిక్కర్ షాపులు తెరిస్తే మళ్లీ అధికారంలోకి రావాలన్న కల నిజం కాదని రజనీ హెచ్చరించారు.
కాగా రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేసి, డోర్ డెలివరీ అంశాన్ని పరిశీలించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ పళని సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Also Read:ఇండియాలో 63 వేలకు చేరువలో కరోనా కేసులు: 2 వేలు దాటిన మరణాలు
ప్రస్తుత పరిస్ధితుల్లో డోర్ డెలివరీ సాధ్యం కాదని, ఆదాయం పడిపోతుందని తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రతిపక్షనేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. కాగా తమిళనాడులో ఇప్పటి వరకు 6,535 మంది కోవిడ్ 19 బారినపడ్డారు. 44 మంది ప్రాణాలు కోల్పోయారు.