నీకంత సీన్ లేదు: రజనీపై అన్నాడీఎంకె తీవ్ర వ్యాఖ్యలు

Published : Aug 14, 2018, 06:36 PM ISTUpdated : Sep 09, 2018, 01:39 PM IST
నీకంత సీన్ లేదు: రజనీపై అన్నాడీఎంకె తీవ్ర వ్యాఖ్యలు

సారాంశం

:డీఎంకె చీఫ్ కరుణానిధి అంత్యక్రియల్లో సీఎం పళనిస్వామి పాల్గొనకపోవడంపై సినీ నటుడు రజనీకాంత్  విమర్శలు గుప్పించడంపై  అన్నాడీఎంకె తీవ్రంగా స్పందించింది. 


చెన్నై:డీఎంకె చీఫ్ కరుణానిధి అంత్యక్రియల్లో సీఎం పళనిస్వామి పాల్గొనకపోవడంపై సినీ నటుడు రజనీకాంత్  విమర్శలు గుప్పించడంపై  అన్నాడీఎంకె తీవ్రంగా స్పందించింది. పార్ట్‌టైం నేత నుండి పూర్తిస్థాయి రాజకీయనాయకుడిగా ముద్రవేసుకొనేందుకు రజనీకాంత్  కరుణానిధి అంత్యక్రియలను ఉపయోగించుకొన్నారని  అన్నాడీఎంకె విమర్శలు గుప్పించింది.

డీఎంకె చీఫ్ కరుణానిధి అంత్యక్రియల్లో సీఎం పళనిస్వామి పాల్గొనకపోవడంపై  సినీ నటుడు రజనీకాంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై అన్నాడీఎంకె  స్పందించింది. తమ పార్టీ సీనియర్ నేత డి. జయకుమార్  సీఎం ఆదేశాల మేరకు కరుణానిధి అంత్యక్రియల్లో పాల్గొన్నారని అన్నాడీఎంకె ప్రకటించింది.

కరుణానిధి సంతాప సభలో రజినీకాంత్ రాజకీయాలు మాట్లాడాల్సింది కాదని  అన్నాడీఎంకె నేత జయకుమార్ అన్నారు.  అది మృతిచెందిన ఓ నాయకుడి సంతాప సభ. అక్కడ రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదన్నారు. రాజకీయాలు మాట్లాడడం వల్ల మిత్రుడు రజినీకాంత్‌కు రాజకీయ పరిణితి లేదని అర్థమవుతోందన్నారు. 

సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు జరిగిన కరుణానిధి సంతాప సభలో రజినీకాంత్ మాట్లాడుతూ  పళనిస్వామిపై విమర్శలు గుప్పించారు. 

ఈ వార్త చదవండి

దేశం మొత్తం వచ్చినా.. మీరు ఎందుకు రాలేదు..? రజినీకాంత్ ఫైర్

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే