కర్ణాటక సీఎం కుమారస్వామి ఆలయాల దర్శన రికార్డు

By sivanagaprasad KodatiFirst Published Aug 14, 2018, 6:11 PM IST
Highlights

అదృష్టవంతుడు ఎవరబ్బా అంటే టక్కున చెప్తారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అని. తక్కువ స్థానాలు గెలుచుకున్న అదృష్టం వరించడంతో ముఖ్యమంత్రి అయిపోయారు. లక్కీగా సీఎం అయిపోయిన కుమారస్వామి దైవదర్శనాలకు శ్రీకారం చుట్టారు. 82 రోజుల్లో 40 ఆలయాలను సందర్శించి రికార్డు సృష్టించారు

కర్ణాటక:
అదృష్టవంతుడు ఎవరబ్బా అంటే టక్కున చెప్తారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అని. తక్కువ స్థానాలు గెలుచుకున్న అదృష్టం వరించడంతో ముఖ్యమంత్రి అయిపోయారు. లక్కీగా సీఎం అయిపోయిన కుమారస్వామి దైవదర్శనాలకు శ్రీకారం చుట్టారు. 82 రోజుల్లో 40 ఆలయాలను సందర్శించి రికార్డు సృష్టించారు. 

మే 23న కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోజు విడిచి రోజు కుమారస్వామి ఇప్పటి వరకు 40 ఆలయాలు సందర్శించారు.  
సోమవారం కర్ణాటకలోని హరదనహళ్లి ప్రాంతంలోని ఈశ్వర ఆలయంతో పాటు హస్సన్‌ జిల్లాలోని మరో ఐదు ఆలయాలకు వెళ్లారు. ఈ దేవాలయాలతోపాటు మైసూరులోని అడిచుంచనగిరి మఠంతో పాటు మరో ఆరు మఠాలను సందర్శించారట. 


ఈ ఆలయాల సందర్శన తన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడ నుంచి నేర్చుకుననారట. దేవెగౌడ రాజకీయాల్లోకి అడుగుపెట్టాక జోతిష్యాన్నిఎక్కువగా నమ్మడం...భక్తి ఎక్కువగా ఉండటంతో ఆలయాల సందర్శన ఎక్కువగా చేసేవారట. అయితే కుమార స్వామి మాత్రం అంతగా దేవాలయాలను సందర్శించుకునేవారు కాదట. అయితే ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ జీవితంలో కలిగిన అద్భుతాల వల్లో ఏమో కానీ గా ఆలయాలకు వెళ్లడం మొదలుపెట్టారు.  

click me!