ఐపీఎస్ రూప మరో కోణం: ఫ్యాషన్ ఫోటోలకు ఫోజులు

Published : Aug 14, 2018, 04:35 PM ISTUpdated : Sep 09, 2018, 12:20 PM IST
ఐపీఎస్ రూప మరో కోణం: ఫ్యాషన్ ఫోటోలకు ఫోజులు

సారాంశం

నిత్యం ఖాకీ డ్రెస్‌తో  కనపడే ఐపీఎస్ అధికారి రూప తన నివాసంలో ఫ్యాషన్ షూట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రముఖ డిజైనర్ మీను సరవన్ డిజైన్ చేసిన ముదురు బ్లూ కలర్ ప్రాక్‌ను ధరించి రూప  ఫ్యాషన్ పోటోలకు ఫోజులిచ్చారు


బెంగుళూరు: నిత్యం ఖాకీ డ్రెస్‌తో  కనపడే ఐపీఎస్ అధికారి రూప తన నివాసంలో ఫ్యాషన్ షూట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రముఖ డిజైనర్ మీను సరవన్ డిజైన్ చేసిన ముదురు బ్లూ కలర్ ప్రాక్‌ను ధరించి రూప  ఫ్యాషన్ పోటోలకు ఫోజులిచ్చారు.

బెంగుళూరు పరప్పర జైలులో  అక్రమాలను రూప బయటపెట్టారు.  అన్నాడీఎంకె నుండి బహిష్కరణకు గురైన శశికళకు ఈ జైలులో  సకల సౌకర్యాలు కల్పిస్తున్న వైనాన్ని ఆమె ఆధారాలతో బయటపెట్టారు.

మిస్ బెంగుళూరు యూనివర్శిటీ కిరీటం, మిస్ దావణగెరె అవార్డులను విద్యార్థిగా ఉన్న రోజుల్లో తను గెలుచుకొన్నట్టుగా ఐపీఎస్ అధికారి రూప గుర్తు చేసుకొన్నారు. 
ఫోటో షూట్‌పై స్పందిస్తూ ‘నేనేమి పోలీసు విధులను వదిలి ఫ్యాషన్‌ షోలకి వెళ్ళలేదు. ఒక సాధారణ మహిళ సైతం ఫ్యాషన్‌ షోలో పాల్గొని తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవచ్చన్నారు. 

ఫ్యాషన్‌ మోడల్స్, సినిమా నటీమణులు మాత్రమే ఫ్యాషన్‌ షోలకు పరిమితం కాదని అందరికీ తెలియడం కోసం తాను కెమెరా ముందుకొచ్చానని ఆమె  చెప్పారు. ఈ సమయంలో తనతో పాటు మరికొంత మంది మహిళలు కూడా ఫోటో షూట్‌ చేయించుకున్నారని అన్నారు. 

 

కాలేజీ రోజుల్లో అందాల టైటిల్స్‌ గెలుచుకున్న విషయాలను ఎవరికీ చెప్పుకోనని అన్నారు. గడిచిన 10 నెలలుగా ఫ్యాషన్‌ డిజైనర్‌ మీను సరవన్‌ తనకు సలహాలు ఇచ్చిన తరువాత ఈ ఫోటో షూట్‌ చేశానని రూప తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

వెనిజులా తర్వాత ట్రంప్ టార్గెట్ ఈ దేశాలే..|Trump Next Target Which Country?| AsianetNewsTelugu
Business Ideas : కేవలం రూ.10 వేలు చాలు.. మీ సొంతింట్లోనే ఈ వ్యాపారాలు చేయండి, మంచి ఇన్కమ్ పొందండి