Rajasthan CM: రాజస్తాన్ సీఎంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మ.. బీజేపీ సంచలన నిర్ణయం

By Mahesh K  |  First Published Dec 12, 2023, 4:25 PM IST

రాజస్తాన్ తుదపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. రాష్ట్ర సీఎంగా భజన్‌లాల్ శర్మ‌ను బీజేపీ ప్రకటించింది. భజన్ లాల్ శర్మ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మ.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత.


రాజస్తాన్ తుదపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. రాష్ట్ర సీఎంగా భజన్‌లాల్ శర్మ‌ను బీజేపీ ప్రకటించింది. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భజన్ లాల్ శర్మ సుమారు 1.45 లక్షల ఓట్లతో విజయాన్ని నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌ను ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

రాజస్తాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను బీజేపీ సీనియర్ లీడర్, ఎమ్మెల్యే వసుంధర రాజే ప్రకటించారు. వాస్తవానికి రాజస్తాన్ సీఎం రేసులో వసుంధర రాజే కూడా ఉన్నారు. ఆమె ఇది వరకే పలువురు ఎమ్మెల్యేలను పిలిపించుకుని బలప్రదర్శన కూడా చేశారు. కానీ, అనూహ్యంగా బీజేపీ భజన్ లాల్ శర్మను సీఎంగా ప్రకటించింది.

Bhajan Lal Sharma will be the next CM of Rajasthan.

BJP makes a brahmin face CM after himanta vishwa Sharma.
Surprising decisions by BJP.

Sharma is first time MLA.pic.twitter.com/nL8dCJ1c5k

— Harshvardhan tiwari (@poetvardhan)

Latest Videos

సీఎం సీటు కోసం  రాజస్తాన్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. వాస్తవానికి సీఎం కోసం ఎమ్మెల్యేలు ఈ తరహాలో పోటీ పడటం బీజేపీ సాంప్రదాయం కాదు. కానీ, ఇది మనం రాజస్తాన్‌లో చూశాం. సీఎం సీటు కోసం వసుంధర రాజేతోపాటు గజేంద్ర శెకావత్, మహంత్ బాలక్‌నాథ్, దియా కుమారి, అనితా భాదెల్, మంజు బాఘ్‌మర్, అర్జున్ రామ్ మేఘవాల్‌లు కూడా ఉన్నారు. వీరితోపాటు మరికొందరు నేతలు కూడా సీఎం పదవి కోసం ఆశపడ్డారు.

భజన్ లాల్ శర్మ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మ.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత. అసోం సీఎంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన హిమంత బిశ్వ శర్మను బీజేపీ ఎంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా,  రాజస్తాన్ సీఎంగా ఈ సామాజిక వర్గ నేతను ఎంచుకుంది. భజన్ లాల్ శర్మను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితంగా ఉంటాడని సమాచారం.

click me!