సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే నెహ్రూపై బీజేపీ చర్చ - రాహుల్ గాంధీ..

By Sairam Indur  |  First Published Dec 12, 2023, 4:08 PM IST

దేశంలో నెలకొన్న వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ (BJP) నెహ్రూ (Nehru)పై చర్చ పెడుతోందని కాంగ్రెస్ (Congress) పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.


Rahul gandhi : దేశం ఎదుర్కొంటున్న అనేక వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గురించి మాట్లాడుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో కుల ఆధారిత జనాభా గణన జరపాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం దానిపై చర్చించడం లేదని అన్నారు.

లోక సభ నుంచి మహువా మొయిత్రా బహిష్కరణ.. బంగ్లా ఖాళీ చేయాలని హౌసింగ్ కమిటీ ఆదేశం..

Latest Videos

మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘ఇవన్నీ పక్కదారి పట్టించే ఎత్తుగడలే. అసలు సమస్య కుల ఆధారిత జనాభా గణన, ప్రజల సొమ్ము ఎవరికి అందుతోంది? ఈ అంశంపై చర్చించడం వాళ్లకు ఇష్టం లేదు. అందుకే వాటి నుంచి పారిపోతున్నారు’ అని మండిపడ్డారు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ 8 సీట్లు గెలిచాం.. 19 చోట్ల రెండో స్థానంలో నిలిచాం - ఈటల రాజేందర్

ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా బీజేపీ ఓబీసీ నేతను ప్రకటించిందని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఆ రాష్ట్రంలో తమ పార్టీ సీఎం అభ్యర్థి కూడా ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఓబీసీ వర్గానికి చెందిన వారేనని అన్నారు. 

కర్ణాటక రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్..

కానీ కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న 90 మంది అధికారుల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీ వర్గానికి చెందినవారని అన్నారు. వారీ ఆఫీసులు కూడా ఓ మూలన ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘సంస్థాగత వ్యవస్థలో ఓబీసీలు, దళితులు, గిరిజనుల భాగస్వామ్యం గురించి నా ప్రశ్న. ఈ సమస్య నుంచి మమ్మల్ని పక్కదారి పట్టించేందుకు జవహర్లాల్ నెహ్రూ తదితరుల గురించి మాట్లాడుతున్నారు’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.

click me!