రామ జన్మభూమి అయోధ్యలో మాదిరిగానే శ్రీకృష్ఱ జన్మభూమి మథురలో కూడా మందిరాన్ని నిర్మించాలని రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ కోరుతున్నారు. ఇందుకోసం ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు.
రాజస్థాన్ : శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటం తర్వాత రామజన్మ భూమి అయోధ్యలో రామమందిరం సాకారమయ్యింది. దేశంలోని మెజారిటీ హిందువులు, మైనారిటీ ముస్లింల మధ్య అయోధ్య ఆలయ స్థలం విషయంలో వందల సంవత్సరాలుగా వివాదం సాగింది... దీంతో ఈ సమస్య ఇక పరిష్కారం అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ సుప్రీం కోర్టు తీర్పుతో అయోధ్యలోని వివాదాస్పద స్థలంకాస్త హిందువుల చేతికివచ్చి రామమందిర నిర్మాణం జరిగింది. ఆ తర్వాత దేశ ప్రజల సహకారంతో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ భవ్య రామమందిరాన్ని చకచకా నిర్మించి ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం కూడా చేసింది. ఇలా అయోధ్య రామమందిర కల నెరవేరడంతో ఇప్పుడు శ్రీకృష్ణుడి జన్మస్థలం మథురలో కూడా ఆలయం నిర్మించాలన్న డిమాండ్ మొదలయ్యింది.
సామాన్య ప్రజలతో పాటు కొందరు రాజకీయ నాయకులు కూడా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తంచేస్తూనే శ్రీకృష్ణ ఆలయాన్ని కూడా నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఆయన మరో అడుగు ముందుకేసి శ్రీకృష్ణ జన్మస్థలి మథురలో మందిరం నిర్మించేవరకు ప్రతిరోజు ఒక్కపూటే భోజనం చేస్తానని ప్రతిజ్ఞ చేసారు. ఇలా అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట వేళ శ్రీకృష్ణ మందిరం కోసం ప్రతినబూనారు రాజస్థాన్ మంత్రి దిలావర్.
Also Read అయోధ్య రామ మందిరం: చిరు మందహాసంతో నవ్వుతున్న రామ్ లల్లా ఎఐ వీడియో, వైరల్
గతంలో ఆర్ఎస్ఎస్ కరసేవకుడిగా పనిచేసిన మదన్ దిలావర్ అయోధ్య రామమందిరం కోసం ఇలాగే ప్రతినబూనాడు. రామజన్మభూమి అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగేవరకు మాల ధరించనని ప్రతిజ్ఞ చేసాడు. తాజాగా భవ్య మందిరం నిర్మాణం జరిగి బాలరాముడి ప్రాణప్రతిష్ట జరగడంతో తన దీక్షను విరమించారు మంత్రి మదన్. ఇదే సమయంలో మథుర శ్రీకృష్ణ మందిరం కోసం మరో ప్రతిజ్ఞ చేసారు రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్.