అరకాన్ ఆర్మీ అనే తిరుగుబాటు దళాలు మయన్మార్ సైనికుల స్థావరాలను ఆక్రమించుకోవడంతో ఆ దేశానికి చెందిన 276 మంది మయన్మార్ సైనికులు మిజోరంలోకి ప్రవేశించారు. అయితే వారిలోని 184 మందిని తిరిగి వారి దేశానికి పంపించినట్టు అస్సాం రైఫిల్స్ వెల్లడించింది.
గత వారం మిజోరంకు పారిపోయి వచ్చిన 184 మంది మయన్మార్ సైనికులను భారత్ వారి దేశానికి తిప్పి పంపించింది. ఈ విషయాన్నిఅస్సాం రైఫిల్స్ అధికారి వెల్లడించారు. ఇటీవల 276 మంది మయన్మార్ సైనికులు మిజోరంలోకి ప్రవేశించారని, వారిలో 184 మందిని సోమవారం వెనక్కి పంపినట్లు ప్రకటించింది.
Ayodhya: దేశమంతా రామస్మరణ.. ప్రాణ ప్రతిష్ట ముహూర్తంలో డెలివరీలు.. రామ, సీతల పేర్లు
ఐజ్వాల్ సమీపంలోని లెంగ్పుయి విమానాశ్రయం నుంచి పొరుగు దేశమైన రఖైన్ రాష్ట్రంలోని సిట్వేకు మయన్మార్ వైమానిక దళ విమానాల్లో వీరిని తరలించారు. మిగిలిన 92 మంది సైనికులను మంగళవారం ఆ దేశానికి పంపిస్తామని వెల్లడించింది. కాగా.. మయన్మార్ సైనికులు జనవరి 17న ఆయుధాలు, మందుగుండు సామగ్రితో మిజోరంలోని లాంగైటైల్ జిల్లాలోని భారత్-మయన్మార్-బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ వద్ద ఉన్న బందుక్బంగా గ్రామంలోకి ప్రవేశించారు. అనంతరం అస్సాం రైఫిల్స్ ను ఆశ్రయించారు.
కాంగ్రెస్ లోకి 30మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు..: మంత్రి కోమటిరెడ్డి సంచలనం
ఆ సైనికుల శిబిరాన్ని 'అరకాన్ ఆర్మీ' ఫైటర్లు ఆక్రమించుకోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అప్పటి నుంచి వారు అస్సాం రైఫిల్స్ పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ 276 మంది సైనికుల్లో కల్నల్ సహా 36 మంది అధికారులు, 240 మంది కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో రెండు స్కీమ్ లు అమలు చేయనున్న ప్రభుత్వం..
ఇదిలా ఉండగా.. గత ఏడాది నవంబర్ లో 104 మంది మయన్మార్ సైనికులను మిజోరంలోని వివిధ ప్రాంతాల నుంచి మణిపూర్ లోని సరిహద్దు పట్టణం మోరేకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) హెలికాప్టర్ల ద్వారా పంపించారు. ఈ నెల ప్రారంభంలో 255 మంది సైనికులను మయన్మార్ వైమానిక దళ విమానాలు లెంగ్పుయి విమానాశ్రయం ద్వారా వెనక్కి పంపాయి. కాగా.. మిజోరం మయన్మార్ తో 510 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటోంది.