ఏడేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారం, హత్య.. పొలంలోకి తీసుకెళ్లి అమానుషం..

Published : Sep 22, 2021, 04:05 PM IST
ఏడేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారం, హత్య.. పొలంలోకి తీసుకెళ్లి అమానుషం..

సారాంశం

అలా వెళ్లిన బాలిక సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. ఆమెకోసం కుటుంబ సభ్యులు, స్థానికులు వెతకడం మొదలు పెట్టారు. 

జైపూర్ : రాజస్థాన్‌లో పాశవిక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన పక్కింట్లో ఉండే ఏడేళ్ల బాలికపై అత్యాచారం(Rape) చేసి హత్య(Murder) చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యాచారానికి గురైన బాలిక(Minor Girl) మృతదేహం ఆమె ఇంటి వెనుక పొలంలో కనిపెట్టినట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. మంగళవారం నాడు నిందితుడు దినేష్ (20) అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఆ తరువాత తిరిగి వెళ్లేప్పుడు తనకు వీధి కుక్కలంటే భయమని.. అవి దాడి చేస్తాయని వణికిపోయాడు.. ఎవరైనా తనకు ఇంటివరకూ తోడుగా రమ్మని బాలిక కుటుంబాన్ని అభ్యర్థించాడు. 

అది విని ఆ కుటుంబం సరే అంది. అతన్ని ఇంటిదాకా వదిలేసి రమ్మని బాలికను పురమాయించింది. అయితే, అలా వెళ్లిన బాలిక సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. ఆమెకోసం కుటుంబ సభ్యులు, స్థానికులు వెతకడం మొదలు పెట్టారు. బాలిక కనిపించడం లేదంటూ పోలీసులకు సమాచారం కూడా అందించారు.

Women in NDA: కేంద్రం అభ్యర్ధనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులకు.. బాలిక మృతదేహం అర్థరాత్రి ఆమె ఇంటి వెనుక పొలంలో కనిపించింది. అంతేకాదు పోలీసులు ఆమె మృతదేహం దగ్గర చిప్స్, బిస్కెట్ ప్యాకెట్లు కూడా కనిపించాయి. అంటే నిందితులు ఆమెను తీసుకువెళ్లడానికి చిప్స్, బిస్కెట్ ప్యాకెట్లను ఎరగా వాడారని అనుమానిస్తున్నారు.

అంతేకాదు ఆ సమయంలో నిందితుడు, మద్యం తాగి ఉన్నాడు. నేరం జరిగిన ప్రదేశానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశామని తెలిపారు.

ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గుమిగూడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.ఈ కేసులో వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు నాగౌర్ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word