Women in NDA: కేంద్రం అభ్యర్ధనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

By narsimha lodeFirst Published Sep 22, 2021, 4:00 PM IST
Highlights

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలనే కేంద్రం అభ్యర్ధనను  సుప్రీంకోర్టు తిరస్కరించింది. సైన్యంలో స్త్రీ, పురుషులు అనే బేధం లేకుండా చూడాలని కోరింది.

న్యూఢిల్లీ:నేషనల్ డిఫెన్స్ అకాడమీ (National Defence Academy ) ప్రవేశ పరీక్షలకు మహిళల్ని (women) అనుమతించడాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం(union government) చేసిన వినతిని సుప్రీంకోర్టు (Supreme court) తిరస్కరించింది.

ఎన్‌డీఏలోకి (nda) మహిళలను వచ్చే ఏడాది  నుండి అనుమతించే విషయాన్ని వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు తేల్చి  చెప్పింది.ద స్త్రీ, పురుష సమానత్వం  సాధించే దిశగా  సైన్యంలో ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు  ఇటీవలనే ఆదేశాలు జారీ చేసింది.ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షల్లో మహిళలకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ పరీక్షలు రాసేందుకు మహిళలకు అవకాశం కల్పించేలా నోటిఫికేషన్ జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ ఏడాది నవంబర్ 14వ తేదీన ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షలకు మహిళలను మినహాయించాలని కేంద్రం కోరింది. వచ్చే ఏడాది నుండి మహిళలను ఈ పరీక్షలకు అనుమతిస్తామని కేంద్రం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.కేంద్రం వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రక్షణ శాఖ మహిళా అభ్యర్థులకు వైద్య ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరాన్ని సూచించింది. విద్యా పాఠ్యాంశాలు రూపొందించినప్పటికి శిక్షణ ఇతర అంశాలను విడిగా రూపొందించాల్సి ఉందని ఆ ఆఫిడవిట్ లో కేంద్రం తెలిపింది.

click me!