Narendra Modi US Visit: మూడు రోజులు అమెరికాలోనే, బైడెన్‌తో భేటీ కానున్న మోడీ

By narsimha lodeFirst Published Sep 22, 2021, 2:00 PM IST
Highlights

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు బయలుదేరి వెళ్లారు.  మూడు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు.  బుధవారం నాడు ప్రత్యేక విమానంలో మోడీ యూఎస్ టూర్ కు వెళ్లారు. క్వాడ్ దేశాల సదస్సులో మోడీ పాల్గొంటారు. యూఎస్ ప్రెసిడెంట్  బైడెన్ తో ఆయన భేటీ కానున్నారు.

న్యూఢిల్లీ:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(narendra modi)  బుధవారం నాడు అమెరికా (Narendra Modi US Visit)పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు.అమెరికాలో క్వాడ్ (quad)దేశాల నేతలతో మోడీ భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్(joe biden) విజయం సాధించిన తర్వాత మోడీ తొలిసారిగా అమెరికాలో పర్యటిస్తున్నారు.

భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక ఒప్పందాలపై మోడీ బైడెన్ తో(Narendra Modi US Visit )చర్చించనున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరిస్ (kamala harris)తో పాటు క్వాడ్ దేశఆల సదస్సుకు హాజరయ్యే ఆయా దేశాల అధినేతలతో మోడీ భేటీ కానున్నారు.ధ్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు భద్రతా సహకారంపై బైడెన్ తో మోడీ చర్చించనున్నారు. అమెరికాలోని ప్రముఖ వ్యాపారులతో మోడీ భేటీ కానున్నారు.

కరోనా, తీవ్రవాదం, వాతావరణమార్పుల వంటి అంతర్జాతీయ సవాళ్లపై కూడ మోడీ చర్చించనున్నారు.అమెరికాలో ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వంతో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ఇండియాలో పర్యటించారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో  బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించారు.  ట్రంప్ ను కాదని బైడెన్ కు అమెరికావాసులు పట్టం కట్టారు.

click me!