Rajasthan Assembly Election Results: దిగ్గజాలకు చెక్.. షియో స్థానంలో లీడ్ లో 26 ఏళ్ల స్వతంత్ర అభ్యర్థి

By Mahesh Rajamoni  |  First Published Dec 3, 2023, 12:21 PM IST

Rajasthan Election Results 2023: రాజ‌స్థాన్ లో బీజేపీ జోరు కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం బీజేపీ 110 స్థానాల్లో, కాంగ్రెస్ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇత‌రులు 19 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. 
 


Rajasthan Assembly Election Results 2023: ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్, చ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ముందంజ‌లో ఉండ‌గా, తెలంగాణ‌లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. రాజ‌స్థాన్ లో బీజేపీ జోరు కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం బీజేపీ 110 స్థానాల్లో, కాంగ్రెస్ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇత‌రులు 19 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. 

ఇదే క్ర‌మంలో రాజ‌స్థాన్ లో దిగ్గ‌జ రాజ‌కీయ నాకుల‌కు చెక్ పెట్టాడు 26 ఏండ్ల ఒక స్వ‌తంత్య్ర అభ్య‌ర్థి. రాజస్థాన్ లోని షియో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి రవీంద్ర సింగ్ భాటి (26) 7 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. గతంలో బీజేపీలో ఉన్న భట్టి ఈసారి షియో అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి టిక్కెట్ నిరాక‌రించ‌డంతో స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

Latest Videos

undefined

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

కాంగ్రెస్ నుంచి అమీన్ ఖాన్, బీజేపీ నుంచి స్వరూప్ సింగ్ ఖారా, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ నుంచి జలమ్ సింగ్, బీఎస్పీ నుంచి జయ్ రామ్ బరిలో ఉన్నారు. రాజస్థాన్ లో నవంబర్ 25న పోలింగ్ జరగ్గా, ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రాథమిక ట్రెండ్స్ ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందంజలో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలను తిప్పే ధోరణిని ఉంది. 

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

click me!