Assembly Election Results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ హవా.. ఛత్తీస్‌గఢ్‌లో స్వల్ప ఆధిక్యం

Published : Dec 03, 2023, 11:46 AM ISTUpdated : Dec 03, 2023, 12:23 PM IST
Assembly Election Results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ హవా.. ఛత్తీస్‌గఢ్‌లో స్వల్ప ఆధిక్యం

సారాంశం

Assembly Election Results: ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల కౌటింగ్ లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ దూసుకుపోతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌-బీజేపీ మ‌ధ్య హోరాహోరీగా లీడ్ లో ముందుకు సాగుతున్నాయి.   

Assembly Election Results: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కొన‌సాగుతోంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ దూసుకుపోతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌-బీజేపీ మ‌ధ్య హోరాహోరీగా లీడ్ లో ముందుకు సాగుతున్నాయి. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్: 

ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్రకారం మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ తన ఆధిక్యాన్ని 145 సీట్లకు పెంచుకుంది. మొత్తం 230 స్థానాలకు గాను కాంగ్రెస్ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఐదు నియోజకవర్గాల్లో ఇతర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

రాజ‌స్థాన్:

ఇక రాజ‌స్థాన్ లో బీజేపీ జోరు కొన‌సాగుతోంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం తొలి ట్రెండ్స్ వెల్లడవ్వడంతో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందంజలో ఉంది. ప్ర‌స్తుతం బీజేపీ 113 స్థానాల్లో, కాంగ్రెస్ 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇత‌రులు 10 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. 

ఛత్తీస్ గఢ్:

ఛత్తీస్ గఢ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ వెన‌కంజ వేసింది.  బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ సారి ఎలాగైన అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ 49 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ 39 స్థానాల్లో రెండో స్థానంలో ఉంది. 

కాగా, వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలకు కీలకమైన నేపథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఆదివారం ప్రారంభమైంది. ప్రస్తుతం రాజస్థాన్ కాంగ్రెస్ ఆధీనంలో ఉండగా, మధ్యప్రదేశ్ ను బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్, చత్తీస్ గఢ్ కాంగ్రెస్ పాల‌న‌లో ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో నవంబర్ 7 నుంచి 30 వరకు ఎన్నికలు జరిగాయి. ఒక్క చత్తీస్ గఢ్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఛత్తీస్ గఢ్ లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు