Chhattisgarh Election Results: ఛత్తీస్ గఢ్ లో మారిన సీన్.. కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి ముందంజలోకి బీజేపీ

By Asianet NewsFirst Published Dec 3, 2023, 12:13 PM IST
Highlights

Chhattisgarh Election Results 2023 : ఛత్తీస్ గఢ్ లో ఉదయం నుంచి కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అయితే అక్కడ ఒక్క సారిగా సీన్ మారిపోయింది. అధికార పార్టీని వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు దూసుకొచ్చింది.

Chhattisgarh Election Results 2023 : ఛత్తీస్ గఢ్ లో సీన్ మారిపోయింది. ఇప్పటి వరకు ఆధికత్య కనబర్చిన అధికార కాంగ్రెస్ ను బీజేపీ వెనక్కి నెట్టింది. మొత్తం 90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ లో బీజేపీకి ఇప్పుడు 53 స్థానాల్లో ముంజంలో ఉంది. కాంగ్రెస్ 35 స్థానాలతో వెనకబడిపోయింది. మిగిలిన స్థానాల్లో ఇతరులు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు.  

90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించారు. తరువాత ఏవీఎంల లెక్కింపు ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ రంగంలోకి దిగాయి. గురువారం వివిధ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేశాయి. 

Latest Videos

2018లో ఛత్తీస్ గఢ్ లో భూపేశ్ బఘేల్ నేతృత్వంలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ రాజకీయ నేతగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు గత ఐదేళ్లలో కాంగ్రెస్ నేతలు పార్టీ లోపలా, బయటా అనేక పోరాటాలు చేశారు. అయితే సొంత పార్టీ నుంచే భూపేశ్ బఘేల్ కు ఉపముఖ్యమంత్రి టి.ఎస్.సింగ్ దేవ్ నుంచి ప్రత్యక్ష సవాలు ఎదురైంది. ఆయన రెండున్నరేళ్లు తనకు సీఎం పదవి కావాలని పట్టుబట్టారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు నచ్చజెప్పింది. దీంతో ఐక్యమత్యంగా పార్టీ ఎన్నికల్లోకి దిగింది. 

15 ఏళ్లు పాలించిన బీజేపీ 2018లో కేవలం 15 సీట్లతో చత్తీస్ గఢ్ లో చతికిలపడిపోయింది. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పార్టీకి ఓటమిలే ఎదురుయ్యాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ విజయాలతో దూసుకుపోతుంటే.. ఛత్తీస్ గఢ్ లో పరాజయాలే కనిపించాయి. అయితే తాజా ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. 

click me!