తమిళనాడులో వర్ష బీభత్సం.. వానల ప్రభావంతో మరో ముగ్గురు మృతి.. 26కు చేరిన మరణాలు..

Published : Nov 06, 2022, 05:18 AM IST
తమిళనాడులో వర్ష బీభత్సం.. వానల ప్రభావంతో మరో ముగ్గురు మృతి.. 26కు చేరిన మరణాలు..

సారాంశం

తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ వానల వల్ల గడిచిన 24 గంటల్లో ముగ్గురు చనిపోయారు. 25 పశువులు మృత్యువాత పడ్డాయి. 

తమిళనాడులో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాదాపు వారం రోజుల నుంచి కురుస్తున్న వానలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల వల్ల సంభవించిన ప్రమాదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరో ముగ్గురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 26కి చేరిందని రాష్ట్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ ముగ్గురిలో ఇద్దరు చెన్నైకి చెందినవారు కాగా.. మరొకరు తిరువారూర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున సాయం ప్రకటించింది.

ప్రాజెక్ట్ చీతా.. కునో నేషనల్ పార్క్ లో పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి విడుదలైన రెండు చిరుతలు

ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 29న రాష్ట్రాన్ని తాకాయి. అప్పటి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమవతున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 10.04 మి.మీ వర్షపాతం నమోదైంది. నాగపట్నం జిల్లాలోని కొడియకరై స్టేషన్‌లో అత్యధికంగా 9 సెంటీమీటర్లు, రామేశ్వరం (రామనాథపురం)లో 8 సెంటీ మీటర్లు కొట్టారం (కన్యాకుమారి), కులశేఖరపట్టణం (తూత్తుకుడి)లో వరుసగా 7 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

గుజరాత్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్.. పార్టీని వీడిన మాజీ మంత్రి జయనారాయణ వ్యాస్..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశువులు మృత్యువాత పడుతున్నాయి. తీవ్ర ఆస్తినష్టం జరుగుతోంది. శుక్రవారం కురిసిన వర్షానికి దాదాపు 25 పశువులు మృత్యువాత పడ్డాయని,140 గుడిసెలు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్ 4న చెన్నైలో కురిసిన వర్షాలకు దాదాపు 64 చెట్లు నేలకూలాయి. వర్షాలతో సంభవించిన ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధి కింద ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని సీఎం ఎంకె స్టాలిన్ ప్రకటించారు.

రాష్ట్ర మంత్రులు కేఎన్ నెహ్రూ, పీకే శేఖర్ బాబు మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారికి ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని అందించారు.  పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న 14,138 వాటర్‌బాడీలలో దాదాపు 2,480 ట్యాంకులు నీటితో నిండిపోయాయి. అయితే 2,065 ట్యాంకుల్లో 75 శాతం నీరు, 2,799 ట్యాంకుల్లో 51 శాతం నీరు ఉంది. 

ఘోరం.. చేతబడి చేసిందనే నెపంతో 45 ఏళ్ల మహిళ సజీవ దహనం

చెన్నైలో వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు 191 రిలీఫ్ క్యాంపులును ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఈ వానల వల్ల ప్రమాదాల్లో చిక్కుకున్నవారిని రక్షించి సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు.భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే సోమవారం (నవంబర్ 7) వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహేలలో భారీ నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !