జూన్ 1 నుంచి పట్టాలపైకి మరో 200 రైళ్లు: త్వరలో బుకింగ్స్

By telugu team  |  First Published May 20, 2020, 8:35 AM IST

లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో రైల్వే శాఖ జూన్ 1వ తేదీ నుంచి మరో 200 ప్యాసెంజర్ రైళ్లను నడపనుంది. ఇవన్నీ నాన్ ఏసీ రైళ్లే. రైల్వే బుకింగ్స్ త్వరలో ప్రారంభమవుతాయని రైల్వే శాఖ చెప్పింది.


న్యూఢిల్లీ: లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి మరో 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇవన్నీ నాన్ ఏసీ రైళ్లు కావడం విశేషం. ప్రస్తుతం 15 ఏసీ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లు మే 12 తేదీ నుంచి ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ నడుస్తున్నాయి. 

శ్రామిక్ ప్రత్యేక రైళ్లతో పాటు అదనంగా 200 రైళ్లను జూన్ 1వ తేదీ నుంచి నడిపిస్తామని, ఇవి నాన్ ఎసీ సెకండ్ క్లాస్ రైళ్లని, టికెట్లు ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చునని రైల్వే మంగళవారం ట్వీట్ చేసింది. రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని కూాడ త్వరలో అందిస్తామని చెప్పారు. 

Latest Videos

ప్రజా రవాణాను అనుమతించే విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. వలస కూలీల కోసం శ్రామిక్ రైళ్లను నడిపించే విషయంలో కొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

వలస కూలీలతో వస్తున్న రైళ్లను కొన్ని రాష్ట్రాలు లోనికి అనుమతించడం లేదు. అయితే, వలస కూలీలను తప్పనిసరి అనుమతించాలని కేంద్రం చెబుతోంది. లోనికి వస్తున్న వలస కూలీలు కరోనా వైరస్ ను వ్యాప్తి చేస్తున్నారని బీహార్, కర్ణాటక రాష్ట్రాలు అంటున్నాయి. 

లాక్ డౌన్ కు ముందు రైల్వేశాఖ ప్రతి రోజు 12 వేల రైళ్లను నడిపింది.  మే 1వ తేదీ నుంచి వలస కూలీల కోసం 366 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

click me!