వంటగదిగా మారిన పోలీస్ స్టేషన్.. స్వయంగా వండి పేదల ఆకలి తీరుస్తున్న పోలీసులు

By Siva Kodati  |  First Published May 19, 2020, 7:39 PM IST

కరోనా వైరస్ కారణంగా దేశంలో కొన్ని కోట్ల మంది ఆకలితో అల్లాడిపోతున్నారు. భారతదేశంలో 80 కోట్ల మంది వరకు పేదరికంలో ఉన్న వారే కావడంతో.. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో పేదలు అర్థాకలితో అలమటిస్తున్నారు


కరోనా వైరస్ కారణంగా దేశంలో కొన్ని కోట్ల మంది ఆకలితో అల్లాడిపోతున్నారు. భారతదేశంలో 80 కోట్ల మంది వరకు పేదరికంలో ఉన్న వారే కావడంతో.. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో పేదలు అర్థాకలితో అలమటిస్తున్నారు.

ఈ క్రమంలో పలువురు దాతలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్ధలు పేదలకు సాయం చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకు సరిపోవడం లేదు. తాజాగా ఓ వ్యక్తి తన ముద్దుల కుమార్తె మరణంతో కుమిలిపోయాడు.

Latest Videos

undefined

Also Read:సమాజ్‌వాదీ పార్టీ నేత, అతని కుమారుడి కాల్చివేత: సోషల్ మీడియాలో హత్య దృశ్యాలు

ఆమె జ్ఞాపకంగా ఏదైనా చేయాలని భావించి, అన్నదానానికి సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన ఓ వ్యక్తి కుమార్తె ఇటీవల క్యాన్సర్ కారణంగా మరణించింది.

దీంతో తన ముద్దుల కూతురు పేరిట ఏదైనా చేయాలని భావించిన ఆయన అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం వడోదరా పోలీసులను కలిసి తన ఆలోచన చెప్పాడు.

Also Read:కేంద్ర మంత్రి పాశ్వాన్ కార్యాలయంలో ఉద్యోగికి కరోనా: ఆఫీస్ మూసివేత

అప్పటికే ప్రతిరోజూ కరోనా కారణంగా పేదలు ఎదుర్కొంటున్న ఆకలి చావులతో చలించిపోయిన పోలీసులు ఆయన ఆలోచనకు ఆచరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం డీసీపీ సరోజ్ కుమారి ఎనిమిది మంది సభ్యులతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

వీరంతా ప్రతిరోజూ తమ విధులు పూర్తి చేసుకున్న తర్వాత వంట గదిలో వంట చేస్తున్నారు. స్వయంగా వండి నిరుపేదలకు భోజనం పెడతారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది పుట్టినరోజులు, పెళ్లి రోజులకు పెట్టే ఖర్చును డబ్బు లేదా సరుకు రూపంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చి విరాళంగా అందిస్తున్నారు. దాతల సాయంతో పోలీసులు వంట చేసి ప్రతిరోజూ 600 మంది కడుపు నింపుతున్నారు. 

click me!