సమాజ్‌వాదీ పార్టీ నేత, అతని కుమారుడి కాల్చివేత: సోషల్ మీడియాలో హత్య దృశ్యాలు

By Siva Kodati  |  First Published May 19, 2020, 6:53 PM IST

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంటే.. మరోవైపు నేరస్తుల ఆగడాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడిని, ఆయన కుమారుడిని దుండగులు హతమార్చారు


కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంటే.. మరోవైపు నేరస్తుల ఆగడాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడిని, ఆయన కుమారుడిని దుండగులు హతమార్చారు.

వివరాల్లోకి వెళితే.. సంభాల్ జిల్లాలోని షామోసీ విలేజ్ ప్రధాన్ భర్త చోటే లాల్ దివాకర్, అతని కుమారుడు సునీల్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను సమీక్షించేందుకు వెళ్లారు.

Latest Videos

అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులను గురించి అధికారులను, స్ధానికులను అడిగి తెలుసుకుంటుండగా నవీందర్ అనే వ్యక్తి కొంతమంది అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు.

తమ పొలాల మీదుగా రహదారి నిర్మాణం చేపట్టవద్దని వారితో వాగ్వాదానికి దిగాడు. అసభ్యపదజాలంతో ఒకొరినొకరు దూషించుకుంటూ కొట్లాటకు దిగారు. ఈ క్రమంలో నవీందర్ వెంట వున్న ఇద్దరు వ్యక్తులు తమతో పాటు తెచ్చుకున్న తుపాకీతో చోటే లాల్ దివాకర్‌, సునీల్‌ను కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే చోటే, సునీల్‌తో నరీందర్ గొడవ.. హత్యకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. 2017లో సమాజ్‌వాదీ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన చోటే లాల్‌కు నిరాశ ఎదురైంది. స్థానిక రౌడీలతో ఉన్న విభేదాలే ఆయన హత్యకు దారితీసి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

click me!