2024లో మోడీని రాహుల్ గాంధీ సవాల్ చేస్తారు.. కానీ ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయిస్తాయి - అశోక్ గెహ్లాట్

By team teluguFirst Published Nov 10, 2022, 5:01 AM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సవాల్ చేసే శక్తి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం వల్ల రాహుల్ గాంధీ ఇమేజ్ మసకబారిందని, కానీ ఆయన ఏంటో ఇప్పుడు ప్రజలకు అర్థం అయ్యిందని చెప్పారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని సవాలు చేసే సత్తా రాహుల్ గాంధీకి ఉందని, అయితే అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఉమ్మడి పీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం అన్నారు. ‘భారత్ జోడో యాత్ర’ ద్వారా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చెబుతున్న అంశాలు సాధారణ ప్రజలకు సంబంధించినవని, ఆయన సందేశం దేశంలోని ప్రతీ ఇంటికి చేరుకుంటోందని ‘పీటీఐ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గెహ్లాట్ అన్నారు.

గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటన..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ బాగా పనిచేస్తుందని నొక్కి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ శరవేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ లో నవంబర్ 12న ఎన్నికలు జరగబోతున్నాయిని, కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకం తనకుందని గెహ్లాట్ అన్నారు. గుజరాత్ లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ఐదు యాత్రలు చేశామని, అక్కడ కూడా తాము బాగా రాణిస్తామని నమ్మకం ఉందని అన్నారు.

ఐబీతో 6 గంటల పాటు కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం.. ఉగ్రవాదంపై పోరాటం, దాని మద్దతు వ్యవస్థ పై చర్చ

రాహుల్ గాంధీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఆయన ఓ మార్గంలో (భారత్ జోడో యాత్ర) ఉన్నారని, అందుకే అనేక రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నారని చెప్పారు. దీనికి ఏ ఇతర కారణమూ లేదని, అయినా దీనిని సమస్యగా మార్చే ప్రయత్నాలు జరగుతున్నాయని చెప్పారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంతం కావాలని, సోదరభావం ఉండాలని రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉద్దేశ్యం అని అన్నారు. ఆయన సందేశం ప్రతీ ద్వారానికి చేరుతోందని చెప్పారు.

రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలని చాలా డిమాండ్ ఉందని అశోక్ గెహ్లాట్ అన్నారు. కానీ అందులో ఆయన పాల్గొనవచ్చని, లేదా పాల్గొనకపోవచ్చు అని కూడా అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీని రాహుల్ గాంధీ సవాలు చేస్తారా అనే ప్రశ్నకు.. సవాలు చేసే శక్తి ఆయనకు మొదటి నుంచి ఉందని అన్నారు. కానీ సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం వల్ల ఆయన ఇమేజ్ మసకబారిందని, కానీ ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు దేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాయని, అన్ని విపక్ష రాజకీయ పార్టీలు కలిసి ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తాయని చెప్పారు.

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి.. 16 మందికి గాయాలు..

కాగా.. హిమాచల్ ప్రదేశ్ లోని మొత్తం 68 స్థానాలకు నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. అలాగే గుజరాత్ లోని 182 అసెంబ్లీ స్థానాలకు గాను 89 నియోజకవర్గాల్లో డిసెంబర్ 1న తొలి దశలో పోలింగ్ జరగనుండగా, మిగిలిన 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది.

click me!