ఐబీతో 6 గంటల పాటు కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం.. ఉగ్రవాదంపై పోరాటం, దాని మద్దతు వ్యవస్థ పై చర్చ

By team teluguFirst Published Nov 10, 2022, 2:34 AM IST
Highlights

కేంద్ర మంత్రి అమిత్ షా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఇది సుధీర్ఘంగా 6 గంటల పాటు సాగింది. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాల నియంత్రణపై ఇందులో చర్చ జరిగింది. 

ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, ఉగ్రవాద ఫైనాన్సింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్, సైబర్ నేరాలు, డ్రోన్‌ల వినియోగం తదితర అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం దేశవ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులతో సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఆరు గంటల సుదీర్ఘ సమావేశంలో, ఉగ్రవాద వ్యతిరేక, మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల మధ్య సమాచార భాగస్వామ్యం,  సంబంధాన్ని పెంపొందించే ప్రక్రియను రాష్ట్రాలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని హోంమంత్రి నొక్కిచెప్పారు.

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి.. 16 మందికి గాయాలు.. 

దేశ భద్రతను కాపాడటంలో ప్రభుత్వ నిబద్ధతతో వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశంలో శాంతిని కొనసాగించడంలో ఎలాంటి అంచనాలు లేకుండా అజ్ఞాతంగా చాలా ముఖ్యమైన సహకారం అందించినందుకు ఇంటిలిజెన్స్ బ్యూరోను ఆయన ప్రశంసించారు.

మన పోరాటం ఉగ్రవాదంతో పాటు దాని మద్దతు వ్యవస్థకు వ్యతిరేకంగా ఉందని, ఆ రెండింటిపై పోరాడి విజయం సాధించాలని అన్నారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం, దాని ఆర్థిక, రవాణా మద్దతు వ్యవస్థను నిర్వీర్యం చేసి కంట్రోల్ లో ఉంచాల్సిన అసవరం ఉందని తెలిపారు. మాదకద్రవ్యాలు దేశంలోని యువతను నాశనం చేయడమే కాకుండా, దాని ద్వారా సంపాదించే డబ్బు దేశ అంతర్గత భద్రతను కూడా ప్రభావితం చేస్తోందని కేంద్ర హోం మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే దానిని పూర్తిగా నాశనం చేయడానికి అందరం కలిసి పని చేయాలని చెప్పారు.

ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ సభ్యుడిపై అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

భారత్‌కు ఆయుధాలు, డ్రగ్స్, పేలుడు పదార్థాలను పంపడానికి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాయని అన్నారు. వాటిని ఆపడానికి మనం యాంటీ డ్రోన్ టెక్నాలజీని గరిష్టంగా ఉపయోగించాలని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో గత నెలలో జరిగిన రాష్ట్రాల హోం మంత్రుల చింతన్ శివిర్ లో అమిత్ షా మాట్లాడుతూ.. దేశంలోని అంతర్గత, బాహ్య భద్రతా సమస్యల కోసం ఉమ్మడి వ్యూహం సిద్ధం చేయాలని రాష్ట్రాలను కోరారు. 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బ్రాంచ్ లను ప్రారంభిస్తామని కూడా ఆయన ప్రకటించారు. 

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు రూ.545 కోట్ల విరాళాలు

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో నిర్ణయాత్మక విజయం సాధించడానికి, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ బలోపేతం చేయబడుతోందని ఈ సందర్భంగా అమిత్ షా తెలిపారు. అందులో భాగంగా ఎన్ఐఏ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం సవరింనున్నామని చెప్పారు. వీటి వల్ల ఎన్ఐఏకు అదనపు ప్రాదేశిక అధికార పరిధితో పాటు ఉగ్రవాదులు సంపాదించిన ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా వస్తుందని తెలిపారు. రాడికల్ సంస్థలు, వ్యక్తులపై నిఘా ఉంచడం, వ్యవస్థీకృత నేరస్థులు, పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదుల బంధాన్ని విచ్ఛిన్నం చేయడం, నార్కో-టెర్రరిస్టులపై అణిచివేత అవసరాన్ని ఈ ఏడాది అంతర్గత భద్రతపై జరిగిన పలు సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. 

click me!