
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనను ‘ఎన్నికల ప్రేరణ పొందిన హిందువు’గా అభివర్ణించారు. రాహుల్ గాంధీ మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తున్నారని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాత్రమే ఇలాంటి పనులు చేస్తారని మిశ్రా ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సిసోడియా ను పదవి నుంచి తొలగించాలి - బీజేపీ.. ప్రజల మద్దతు కోరుతూ సంతకాల సేకరణ ప్రారంభం
గుజరాత్‌లో రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ నాయకుడు ఇటీవల చేసిన ఎన్నికల వాగ్దానానికి కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. “ఎన్నికలు వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ కేవలం తప్పుడు ఎన్నికల వాగ్దానాలు చేస్తారు. ఇది గుజరాత్ ప్రజలతో పాటు దేశం మొత్తానికి బాగా తెలుసు, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాహుల్ 10 రోజుల్లో రూ. 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తానని తప్పుడు వాగ్దానం చేశారు.’ అని మరో ట్వీట్‌లో ఆరోపించారు.
‘‘ రాహుల్ గాంధీ ఈరోజు గుజరాత్ పర్యటనలో ఉన్నారు. గతంలో గుజరాత్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా అక్కడ అంతకు ముందే కాంగ్రెస్ విచ్చిన్నమయ్యే స్థితిలో ఉంటుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ‘కాంగ్రెస్ క్విట్ యాత్ర’గా మారింది. కాంగ్రెస్ ఇండియా జోడో ప్రచారాన్ని ప్రారంభించవచ్చు లేకపోతే ప్రారంభించకపోవచ్చు. కానీ క్విట్ కాంగ్రెస్ ప్రచారం ప్రారంభమైంది. ’’ అని నరోత్తమ్ మిశ్రా అన్నారు. కాంగ్రెస్ లో పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు ప్రజల్లోకి వెళ్లరని ఆయన ఆరోపించారు. అందుకే ఆ పార్టీ సోషల్ మీడియా సాయం తీసుకుంటోదని చెప్పారు.
బెంగళూరు వరదలు.. గత ప్రభుత్వాలే కారణం: కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై
కాగా.. సోమవారం అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌లో జరిగిన 'పరివర్తన్ సంకల్ప్ ర్యాలీ'లో కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గుజరాత్‌లో రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ, రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్, 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ పథకాల హామీపైనే నరోత్తమ్ మిశ్రా నేడు కామెంట్స్ చేశారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్.. తిప్పికొట్టిన భారత్
‘రేవాడి’ (ఉచిత) సంస్కృతి దేశానికి ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఉచిత పథకాలపై చర్చకు దారి తీసింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు కూడా చేరాయి. ఉచిత పథకాలపై ప్రస్తుతం భారత సర్వోన్నత న్యాయ స్థానంలో విచారణ జరుగుతోంది. అయితే ఇలాంటి సమయంలో గుజరాత్ లో రాహుల్ గాంధీ ఈ హామీలు ఇచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మహిళలకు నెలకు రూ. 1,000, 24 గంటల పాటు విద్యుత్ సరఫరాను హామీ ఇచ్చింది. కాగా ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.