
చెన్నై: అస్వస్థతకు గురై ఆసుపత్రికలో చికిత్స పొందుతున్న డీఎంకె చీఫ్ కరుణానిధిని కావేరీ ఆసుపత్రిలో మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. మంగళవారం నాడు సాయంత్రం కావేరీ ఆసుపత్రిలో కరుణను రాహుల్ పరామర్శించారు.
కరుణానిధి కుటుంబసభ్యులను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరుణానిధితో తమకు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకొన్నారు. ఇప్పడే ఆయనను కలుసుకొన్నాను. కరుణానిధి బాగున్నారని చెప్పారు. తమిళనాడు మాదిరిగానే కరుణానిధి కూడ చాలా గట్టి మనిషని చెప్పారు. తమిళనాడు స్పూర్తి ఆయనలో బలంగా ఉందని రాహుల్ చెప్పారు.
కరుణానిధి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కావేరీ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. వైద్య చికిత్సకు కరుణానిధి స్పందిస్తున్నారని ఆసుపత్రివర్గాలు ఇదివరకే ప్రకటించాయి.
మరోవైపు ఆసుపత్రిలో ఉన్న కరుణానిధిని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు కావేరీ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఆసుపత్రి వద్ద పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరుణానిధి కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్దే ఉంటున్నారు.
"