బిందెలో ఇరుక్కున్న బుల్లోడి బుర్ర.. క్షణక్షణం ఉత్కంఠ.. ఊరు మొత్తం పడిగాపులు

First Published Jul 31, 2018, 2:54 PM IST
Highlights

పాకడం కూడా రాని పిల్లాడు ఊరు మొత్తాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించాడు.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌‌కు సమీపంలోని నగలా గ్రామానికి చెందిన లాల్‌చంద్ అనే రైతుకు ఏడాదిన్నర వయసున్న పీయూష్ అను కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారి అల్లరితో ఇల్లంతా సందడి సందడిగా ఉండేది.. ఇలాంటి సమయంలో ఒక రోజు ఇంట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ బిందెలో బుర్రపెట్టాడు

పాకడం కూడా రాని పిల్లాడు ఊరు మొత్తాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించాడు.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌‌కు సమీపంలోని నగలా గ్రామానికి చెందిన లాల్‌చంద్ అనే రైతుకు ఏడాదిన్నర వయసున్న పీయూష్ అను కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారి అల్లరితో ఇల్లంతా సందడి సందడిగా ఉండేది.. ఇలాంటి సమయంలో ఒక రోజు ఇంట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ బిందెలో బుర్రపెట్టాడు.. పెట్టడమైతే పెట్టాడు గానీ.. అందులోంచి తల బయటకు రావడం లేదు.

ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఏడుపు లంకించుకున్నాడు.. పిల్లాడికి ఏం జరిగిందో ఏంటోనని ఇంట్లో వాళ్లు పరిగెత్తుకొచ్చారు. బిందెలో తల ఇరుక్కోవడంతో ఒళ్లంతా చెమటలు పడుతూ చిన్నారి ఏడుస్తూ కనిపించాడు. దీంతో కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారంతా ఆ బిందెలోంచి బాలుడి తలను బయటకు తీసేందుకు ప్రయత్నించారు.. అయినా ఫలితం లేకపోయింది.

విషయం ఆ నోటా ఈ నోటా గ్రామం మొత్తం పాకిపోయింది. ఎక్కువగా ప్రయత్నిస్తే పిల్లాడి ప్రాణాలకే ప్రమాదమని గ్రహించి వైద్యుల వద్దకు తీసుకెళ్లారు.. వారు కూడా చేతులెత్తేయడంతో చేసేది లేక బిందెలు తయారు చేసే వారి దగ్గరికి వెళ్లగా.. వారు అత్యంత చాకచాక్యంగా తలను బిందె నుంచి వేరు చేశారు. దీంతో ఆ చిన్నారి కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. క్షణక్షణం ఉత్కంఠ కలిగించిన ఈ సంఘటన గురించి ఊరంతా చర్చించుకుంటున్నారు. 

click me!