అలాగైతే.. కాంగ్రెస్ వాళ్లంతా నగ్నంగా తిరగాలి: రాహుల్ గాంధీని రాముడితో పోల్చడంపై బీజేపీ

Published : Dec 27, 2022, 06:39 PM IST
అలాగైతే.. కాంగ్రెస్ వాళ్లంతా నగ్నంగా తిరగాలి: రాహుల్ గాంధీని రాముడితో పోల్చడంపై బీజేపీ

సారాంశం

రాహుల్ గాంధీని రాముడు అంటూ సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రియాక్ట్ అయింది. చలి పెట్టకుండా ఉండటానికి అతను ఏం తింటున్నాడో అతని సేనకు చెప్పాలని బీజేపీ లీడర్ దుశ్యంత్ అన్నారు. అంతేకాదు, రాముడి సేన తరహాలోనే రాహుల్ గాంధీ సేన కూడా నగ్నంగా తిరగాలని పేర్కొన్నారు.  

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీని రాముడు అంటూ సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కటువుగా విమర్శలు చేసింది. రాహుల్ గాంధీ రాముడి అవతారమైతే.. అప్పుడు కాంగ్రెస్ వాళ్లంతా రాముడి సేన లాగే నగ్నంగా తిరగాలని బీజేపీ నేత దుశ్యంత్ గౌతమ్ అన్నారు.

రాహుల్ గాంధీ సోమవారం మహాత్మా గాంధీ, మాజీ ప్రధానుల సమాధులను సందర్శించారు. వారికి నివాళులు అర్పించారు. ప్రత్యర్థి పార్టీ బీజేపీ నేత, దివంగత పీఎం అటల్ బిహారీ వాజయ్‌పేయి స్మృతివనాన్నీ సందర్శించారు. సోమవారం ఉదయం శీతల వాతావరణంలోనూ ఆయన కేవలం ప్యాంట్ టీషర్ట్ ధరించి అక్కడికి వెల్లారు.

దీంతో రాహుల్ గాంధీకి చలి పెట్టదా? అంటూ చర్చ మొదలైంది. దీనిపై ప్రశ్నిస్తే.. ఇదే ప్రశ్న మీరు దేశంలోని రైతులు, కార్మికులను ఎందుకు అడగరు? అంటూ ఎదురు ప్రశ్న మీడియాకు వేశారు.

Also Read: రాహుల్ గాంధీ అంటే రాముడు.. కాంగ్రెస్ అంటే భారత్ - కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్

ఈ సందర్భంలోనే రాహుల్ గాంధీని యోగితో పోల్చుతూ కాంగ్రెస్ ప్రశంసించింది. ఆయనను రాముడితోనూ పోల్చింది. కాగా, బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యల పై మండిపడింది. 

‘ఒక వేళ రాహుల్ గాంధీ రాముడి అవతారమైతే.. ఆయనకు చలి పెట్టకుండా ఏం తింటాడో ఆయన సేనకు కూడా చెప్పాలి. ఆయన సేన కూడా రాముడి సేన తరహా నగ్నంగా ఎందుకు తిరగడం లేదు’ అంటూ బీజేపీ లీడర్ దుశ్యంత్ గౌతమ్ అడిగారు. అంతేకాదు, చలి పెట్టకుండా ఉండటానికి ఆయన ఏం తీసుకుంటాడో.. ఆయన తల్లికి, సోదరికి కూడా చెప్పాలని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !