ఫోన్ మాట్లాడట్లేదని స్క్రూ డ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపేసిన దుండగుడు

Published : Dec 27, 2022, 05:21 PM IST
ఫోన్ మాట్లాడట్లేదని స్క్రూ డ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపేసిన దుండగుడు

సారాంశం

ఛత్తీస్‌గడ్‌లో ఓ యువతి తనతో ఫోన్ మాట్లాడటం లేదని స్క్రూ డ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపేశాడు. ఆమె నోటి నుంచి అరుపులు బయటకు వినిపించకుండా దిండు అడ్డంపెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమె రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది.  

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గడ్‌లో ఓ దారుణం జరిగింది. 20 ఏళ్ల యువతి తనతో మాట్లాడట్లేదని ఓ దుండగుడు 51 సార్లు స్క్రూ డ్రైవర్‌తో పొడిచి చంపేశాడు. కొర్బా జిల్లాలో ఈ నెల 24వ తేదీన ఘటన జరిగింది. సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లోని పంప్ హౌజ్ కాలనీలో ఈ ఘటన జరిగినట్టు సిటీ ఎస్పీ (కొర్బా) విశ్వదీపక్ త్రిపాఠి తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఘటన జరగడానికి ముందు బాధితురాలు ఇంటిలో ఒంటరిగా ఉన్నది. అప్పుడే నిందితుడు అక్కడికి వచ్చాడు. ఆమె నోటికి దిండును అడ్డుపెట్టి.. ఆమె అరుపులు బయటకు వినిపించకుండా చేసి ఓ స్క్రూ డ్రైవర్‌తో 51 సార్లు పొడిచాడు. 

ఆ మహిళ సోదరుడు ఇంటికి తిరిగి వచ్చే సరికి ఆమె రక్తపు మడుగులో కనిపించిందని అధికారులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో తేలిన విషయాలు ఇలా ఉన్నాయి. నిందితుడు జశ్‌పూర్ జిల్లాకు చెందినవాడు. మూడేళ్ల క్రితం బాధితురాలితో పరిచయం ఏర్పడింది. నిందితుడు బస్ కండక్టర్‌గా చేస్తున్నప్పుడు ఆమె తరుచూ ఆ బస్సులో ప్రయాణిస్తూ ఉండేది. ఆ సమయంలోనే వారికి పరిచయం ఏర్పడింది.

Also Read: సహజీవనం, గర్భందాల్చిన ప్రియురాలు, బిడ్డకు జన్మనిచ్చి మృతి.. పసికందును ముళ్లపొదల్లోకి విసిరేసిన తండ్రి

నిందితుడు ఆ తర్వాత తన పని మీద గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లిపోయాడు. కానీ, వారిద్దరూ ఫోన్‌లో టచ్‌లోనే ఉన్నారు. ఆ మహిళ ఫోన్ మాట్లాడటం మానేసిన తర్వాత నిందితుడు ఆమెను బెదిరించాడు. ఆమె తల్లిదండ్రులనూ బెదిరించినట్టు అధికారులు తెలిపారు.

నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి నాలుగు పోలీసు బృందాలు ఏర్పడ్డాయి.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !